DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హోమ్ క్వారంటీన్ లో రూల్స్ తప్పితే క్రిమినల్ చర్యలు

*పలాస కంటైన్మెంట్ జోన్ లో కలెక్టర్ నివాస్ పర్యటన*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 18, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా లో హోమ్ క్వారంటీన్ లో ఉన్న వారి నిబంధనలను పాటించని వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్ ఆదేశించారు. కరోనా

ప్రమాద ఘంటిక మ్రోగించిన శ్రీకాకుళం జిల్లా లోని పలాస కంటైన్మెంట్ జోన్ లో కలెక్టర్ గురువారం పర్యటించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా స్థానిక యంత్రాగాన్ని తగు సూచనలు చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కరోనాకు సంబంధించిన ఏ చిన్న లక్షణం ఉన్నా అలక్ష్యం వద్దన్నారు. ప్రతి

కాంటాక్టును నిశితంగా శోధించి వెలికి తీయాలని, పలాస కేసులో జూన్ 1 నుండి 15వ తేదీ వరకు డేటా బేస్ వివరంగా రూపొందించాలన్నారు. వ్యక్తి కాంటాక్టులు ప్రతి ఒక్కరి నమూనాలు సేకరించాలని, వారందరూ హోమ్ క్వారంటీన్ లో విధిగా ఉండాలని తెలిపారు. 

పాజిటివ్ కేసుకు ప్రధాన కారకులను గుర్తించాలని, మందస కేసులో ప్రధాన కాంటాక్టును

గుర్తించుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణాల్లో కేసులు అధికంగా వచ్చే అవకాశాలు. అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిస్థితికి అనుగుణంగా పట్టణం మొత్తం కంటైన్మెంట్ జోన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. 

కంటైన్మెంట్ జోన్లలో చెక్ పోస్టు పకడ్బందీగా

ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఈ మార్గంలో ఎవరూ రాకపోకలు సాగించ రాదని తెలిపారు. 

కంటైన్మెంట్ జోన్లలో దుకాణాలు మూసి వేయాలి

కంటైన్మెంట్ జోన్లను పూర్తిగా పారిశుద్ధ్యం చేయాలి

నిత్యావసర వస్తువులు, తాగునీరు సరఫరా చేయాలి

ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేయాలని

సూచించారు

పట్టణంలో చిన్న హోటల్లో పార్సిల్స్ మాత్రమే అనుమతి. భౌతిక దూరం పాటించుటకు అవకాశం ఉన్న హోటల్లో మాత్రమే భోజనాలు చేయుటకు అనుమతి

జిల్లాలో రానున్న రెండున్నర నెలలు అతి కీలకమని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాప్తిని తగ్గించాలి

మునిసిపల్ కమీషనర్ నాగేంద్ర మాట్లాడుతూ పట్టణంలో జీడి,

బంగారు దుకాణాలు స్వచ్చందంగా మూసి వేయుటకు ముందుకు వస్తున్నారు 

అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాథ రావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.లీల, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, తహసీల్దార్ మధుసూదన రావు, ఎంపిడిఓ రమేష్ నాయుడు, సిఐ ఆర్.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam