DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైరస్ నుంచి రక్షించే మాస్క్ లు సిద్ధమవుతున్నాయి.

*మాస్క్ ముక్కుకి మాత్రమే వేసుకోవాలనే రూల్ పెట్టాం: పరిశోధకులు* 

*మీటర్ లోపు ఉన్నవారికి షాక్ కొట్టే లా కూడా కండిషన్ పెట్టాలి* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  18, 2020 (డిఎన్ఎస్):* కరోనా వంటి భయంకర క్రిమి వైరస్ ల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు వైరస్

నుంచి రక్షించే మాస్క్ లు సిద్ధమవుతున్నాయి.  స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అనే సంస్థ ఓ మాస్క్ ను తయారు చేసింది.  అయితే పరిశోధకులు దీన్ని కొనుగోలు చేసేవారికి ఒక కఠినమైన నిబంధన ప్రకటిస్తున్నారు. ఈ మాస్క్ లను ముఖానికి మాత్రమే ధరించాలని, మీదకి, మోకాలికి పెట్టుకుంటే దీని ప్రభావం పనిచేయదని నిబంధనలు

తెలియచేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో చాలామందికి నిర్లక్ష్యం బాగా ఎక్కువగా ఉందని, ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్న మాస్క్ లను ముఖానికి కాకుండా, మెడకి  అదేదో కంఠాభరణం లాగా ధరిస్తున్నారని, అలంటి వారిలో ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, మంత్రులు కూడా ఉండడం గమనించి, తాము తయారు చేసిన ఈ మాస్క్ లను

కచ్చితంగా ముఖానికి వేసుకోవాలని తెలియచేస్తున్నారు. 

మూడు పొరలతో తయారైన ఈ మాస్క్ లోని ఓ పొరలో ప్రత్యేక రసాయనాలను కలిగి ఉంటుంది. దీని నుంచి 0.8 మిల్లి వోల్టుల ధనాత్మక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.సూక్ష్మజీవులు , బ్యాక్టీరియా, వైరస్ లు రుణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటాయి.రుణాత్మక ఆవేశం కలిగిన ఈ సూక్ష్మజీవులు

మాస్క్ ను టచ్ చేసినపుడు రుణాత్మక ఆవేశం కలిగిన సూక్ష్మజీవుల పైపొర పేలిపోతుంది. ఫలితంగా అవి నశిస్తాయని కంపెనీ సీటీవో పేర్కొన్నారు.

భారత్ తో సహా అనేక దేశాల్లో ఈ మాస్క్ లను ఉత్పత్తి చేయబోతున్నారు. ఇప్పటికే ముంబైలో వీటిని విజయవంతంగా ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఈ మాస్క్ ఖరీదు రూ. 1400 నుంచి రూ.1900 మధ్య ఉండొచ్చని

అన్నారు. వారానికి ఒక్క ఒకరోజు వాష్ చేసుకోవచ్చు.. మరియు 210 రోజులు వరకు దీనినీ వాడొచ్చు అని పేర్కొన్నారు...

భారత్ లో పనిచేస్తుందా?. . .. 

ఎంత ఆధునికమైన మాస్క్ లను తయారు చేసినా  భారత్ దేశంలో ఎంతవరకు సత్ఫాలితాలు ఇస్తాయన్నది తెలియదు. ప్రధానంగా ఎన్ 95 వంటి అత్యుత్తమ క్వాలిటీ కల్గిన మాస్క్ లను కూడా ప్రజా

ప్రతినిధులు సైతం ముఖానికి కాకుండా మెడకి వేసుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అలాంటి వారికి ఈ మాస్క్ లు సత్ఫాలితాన్ని ఇస్తాయో అన్నది అనుమానమే. 

ఒక మీటరు కంటే దగ్గరగా ఎవరైనా ఉంటె వారికి షాక్ కొట్టే విధంగా కూడా ఉండే సౌలభ్యాన్ని ఈ మాస్క్ లో జత పరిస్తే మాస్క్ తో పాటు కనీస దూరం కూడా పాటించడం

జరుగుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam