DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం నభూతో న భవిష్యతి

శ్రీరామచంద్రునికి సామ్రాజ్య పట్టాభిషేకం

రామతీర్థం(నెల్లిమర్ల), జులై 8 , 2018 (DNS Online) : అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామతీర్ధాలు పుణ్యక్షేత్రం లో ఆదివారం  à°¶à±à°°à±€à°°à°¾à°®

సామ్రాజ్య పట్టాభిషే మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాలయ నిర్వహణ సంస్థ ( sita ) సంచాలకులు, చిలకపాటి విజయరాఘవాచార్యులు 108 పర్యాయములు

శ్రీరామాయణ పారాయణ చేసిన శుభ సందర్భంగా  à°¶à±à°°à±€ విలంబి నామ సంవత్సరం నిజ జ్యేష్ఠా మాస బహుళ దశమి భరణి నక్షత్ర కన్య లగ్నం రోజు ఆదివారం విజయనగరం జిల్లా రామ తీర్ధంలో

వెలసిన శ్రీరామ స్వామీ దేవస్థానం లో ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అత్యంత వైభవంగా ఈ సామ్రాజ్య మహోత్సవం చేపట్టారు. వేద పండితుల సమక్షంలో

స్వామివారికి పట్టాభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమం తమ మాతృమూర్తి చిలకపాటి లక్ష్మీకాంతమ్మ మంగళశాసనములతో శ్రీ పాంచరాత్రాగమ విధానం లో ఉదయం కందాల రాజగోపాలం

స్వామి, గొడవర్తి కూర్మచార్యుల చే సేవాకాలం తో ఉత్సవం ఆరంభించారు. అనంతరం శ్రీ సంక్షేప రామాయణ హవనం ( రంగసాయి రామాచార్య స్వామి చే ), శ్రీ గాయత్రీ రామాయణ హవనం (

గొడవర్తి నర్సింహాచార్య స్వామి చే), శ్రీ రామతారక మంత్రం హవనం ( తిరుమల రంగనాధ అయ్యవార్లంగార్లు స్వామి చే) శాస్త్రోక్తంగా ఆచరించారు. ఉదయం  10 గంటలకు  à°¶à±à°°à±€ సీతారామ

కల్యాణ మహోత్సవం ( శ్రీభాష్యం శ్రీనివాసాచార్య స్వామి, గుడిమెళ్ళ కూర్మనాథ స్వామి, యు వి సోమయాజులు స్వామి, గొడవర్తి శేషావతారం స్వామి ల అద్భుత వ్యాఖ్యానం తో),

తదుపరి 11 :30 గంటలకు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం ( శ్రీభాష్యం శ్రీనివాసాచార్య స్వాము, కందాల రాజగోపాలాచార్య స్వామి, గుడిమెళ్ళ కూర్మనాథ స్వామీ ల చే

వ్యాఖ్యానం ) నిర్వహించారు. .శ్రీరామాయణ పథాన, శ్రావణ, అనుష్టాన ప్రయోజనాలను తిరుమల రంగనాధ అయ్యవార్లంగార్లు, చిలకపాటి విజయరాఘవాచార్య స్వామి లచే వ్యాఖ్యాన పూర్వక

వివరణ చేశారు. అనంతరం à°ˆ మహోత్సవానికి విచ్చేసే భక్తులందరికీ తదీయారాధన, జారుతుందని వివరించారు. à°ˆ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్‌ఎస్‌వీ ప్రపాద్‌, కందాల

రాజగోపాలాచార్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam