DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆన్ లైన్ లో రాజమండ్రి జల విహార్ రూమ్ ప్రారంభం 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  19, 2020 (డిఎన్ఎస్):* రాజమహేంద్రవరంలో జల విహార నియంత్రణ కేంద్రాన్ని అమరావతి నుండి శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.   జల విహార యాత్రలో ప్రమాదాలు నివారించి 0 స్థాయికి చేరే విధంగా పర్యాటక శాఖ

అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గోదావరి నది లొ బోటు ప్రమాదాలు నివారించే చర్యలలో  భాగంగా రాజమహేంద్రవరం పద్మావతిఘాట్ వద్ద పర్యాటక శాఖ  ఏర్పాటుచేసిన జలవిహార నియంత్రణ కేంద్రాన్ని శుక్రవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి క్యాంపు కార్యాలయం  నుండి ఆన్లైన్ ద్వారా

ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తూర్పు గోదావరి జిల్లా నుండి రాజమహేంద్రవరం పర్యాటక కంట్రోల్ రూమ్ నుండి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 ప్రాంతాలలో ఈ జల విహార నియంత్రణ కేంద్రాలు

ఏర్పాటు చేసి తొమ్మిది మంది స్పెషల ఆఫీసర్ లను నియమించామని, రాజమహేంద్రవరం, గండి పోచమ్మ గుడి, పోచవరం, సింగన్న పల్లి, పేరంటాలపల్లి, నాగార్జునసాగర్, గుంటూరు, విజయవాడ, శ్రీశైలంలో ఈ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో ప్రమాదాలు  పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని,  అధికారులకు ఆదేశాలు

ఇస్తూ, వారానికి ఒకసారి కంట్రోల్ రూమ్ లో పనితీరుపై జిల్లా కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలన్నారు.  బోట్లకు లైసెన్సులు మంజూరు విధానంలో సరైన పద్ధతులు పాటించాలన్నారు.  జిల్లా కలెక్టరు డి మురళీధర్ రెడ్డి పర్యాటక శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ప్రయాణికుల రక్షణ చర్యల్లో కరోనా వైరస్ జాగ్రత్త చర్యలతో పాటు వారి పూర్తి

డేటాను సహకరించాలని,  సామాజిక దూరం పాటించడం,  ప్రతి ఒక్కరూ మాస్కులు  ధరించే విధంగా  చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భరత్ రామ్,  సబ్ కలెక్టర్ మరియు కార్పొరేషన్ కమిషనర్ అభి షి క్త్  కిషోర్, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు,

పర్యాటక శాఖ, డివిజనల్ మేనేజర్ డీజే ఎస్ ప్రకాష్, స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ పవన్, ఆర్ డి టి రాజు, యూనిట్ మేనేజర్ వీర్రాజు, సిటీ తాసిల్దార్ సుస్వాగతం తదితరులు ఉన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam