DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫేస్‌‌బుక్‌ లో గ్రామ వాలంటీర్, వివాహితపై వేధింపుల నిర్వాకం

*దిశా చట్టం ఉందని తెలిసినా పట్టింపు లేదంటే. . .*

*అవగాహనా చెప్పవలసిన వాలంటీరే వేధింపులకు పాల్పడితే. . ?*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  19, 2020 (డిఎన్ఎస్):* ఉదయం లేస్తే ఇల్లిల్లు తిరిగే అందరినీ సానుకూలంగా పలకరించవలసిన గ్రామా వాలంటీర్ పేస్ బుక్ ద్వారా తన

పైశాచికత్వాన్ని బయట పెట్టాడు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కప్పవరం గ్రామానికి చెందిన దుర్గ రెడ్డి అనే గ్రామా వాలంటీర్ తన ఇంటి ప్రక్కనే ఉన్న ఓ వివాహిత మహిళా ఫోటోలను పేస్ బుక్ లో పెట్టి వేధించడంతో ఒక సారి పోలీసులు వర్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫోటోలను తొలగిస్తానని చెప్పి నెలరోజులు గడిచినా తొలగించక పోవడంతో

పాటు ప్రత్యక్షంగా వేధింపులు కూడా చెయ్యడం ఆ మహిళా ఇతని ఇంటిముందు ప్రత్యక్ష ధర్నాకు దిగింది. 

వాలంటీర్ పనిచేసే గ్రామా సచివాలయంలోనే దిశా చట్టం పరిధిలోకి వచ్చే ఉద్యోగి కూడా ఉంటారు, మహిళపై వేధింపు లు చెయ్యవద్దని చెప్పవలసిన వాలంటీరే  వేధింపులకు పాల్పడితే చట్టం పై అమలు పై వాళ్ళకే ఎంత నమ్మకం ఉందొ

తెలుస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే. . .

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు చెందిన ఓ మహిళ.. భర్త వ్యాపార నిమిత్తం ఇతరప్రాంతాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల గ్రామమైన కొప్పవరం గ్రామంలో నివాసం ఉంటుంది. 

ఇంటి యజమాని కొడుకు, గ్రామవాలెంటీర్ అయిన

దుర్గారెడ్డి అక్కా అని పిలుస్తూ ఆమెతో చనువుగా ఉండేవాడు. 

ఈ క్రమంలో ఆమె పేరుతో పేక్ ఫేస్ బుక్ ఐడి క్రియేట్ చేసి, కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. 

అందుకు ఆమె అంగీకరించకపోవడంతో మరింత వేధించ సాగాడు. 

దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా.. ఫోటోలు డిలీట్ చేస్తానని

చెప్పడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు.

నెలరోజులైనా ఫేస్ బుక్ లో ఫోటోలు తొలగించక పోవడంతో దుర్గారెడ్డిని మహిళ నిలదీసింది. 

ఈ ఘటనతో తన భర్త పిల్లలతతో సహా తనను ఇంటి నుంచి పంపించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

కుటుంబ సభ్యులతో కలిసి దుర్గారెడ్డి ఇంటివద్ద ధర్నాకు

దిగింది. 

పోలీసులు, గ్రామ పెద్దలు సైతం తమకు న్యాయం చేయడంలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam