DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21న సూర్యగ్రహణం, అరసవల్లి ఆలయం ఉదయం మూసివేత

*ఉదయం 10:26 నుంచి 01:54 వరకు గ్రహణ కాలం: అర్చకులు* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 20, 2020 (డిఎన్ఎస్):* ఈ నెల 21న  పాక్షిక సూర్యగ్రహణమును పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం ఉదయం మూసివేయడం జరుగుతుందని ప్రధాన అర్చకులు ఇప్పిలి

శంకర శర్మ తెలిపారు. స్వస్తిశ్రీ చాంద్రమాన శార్వరి నామ సంవత్సర జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం నాడు ఉదయం 10:26 నిమిషాలకు గ్రహణం స్పర్శ కాలం... తిరిగి మధ్యాహ్నం 01:54 నిముషాలకు గ్రహణ మోక్షకాలం అని తెలిపారు. 

ఆదివారం రాహుగ్రస్త సూర్య గ్రహణం కారణంగా ఉదయం నుండి భక్తులకు శ్రీ స్వామివారి దర్శనం నిలిపివేయబడింద ని ఆయన

చెప్పారు. గ్రహణానంతరం శ్రీ స్వామివారి ఆలయ సంప్రోక్షణ, పుణ్య హవచన, శుద్ధి కార్యక్రమం అనంతరం మహా నివేదన జరుగుతుందని ఆయన తెలిపారు.

21న సాయంత్రం 5 నుంచి 7 వరకే దర్శనం : ఈఓ 

              21న పాక్షిక సూర్య గ్రహణం కారణంగా 20వ తేదీ శనివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారి దేవాలయం తలుపులు మూసి వేస్తాము అని

సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి.హారి సూర్య ప్రకాష్ తెలిపారు. గ్రహణ సమయం అనంతరం ఆలయ శుద్ధి తర్వాత ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి 7 గంటల వరకు రెండు గంటలు మాత్రమే స్వామివారి దర్శనం కు అనుమతి ఇస్తామని వారు పేర్కొన్నారు. కోవిడ్  19 నిబంధనలు భాగంగా కనీస దూరం పాటిస్తూ, మాస్కు ధరించిన భక్తులకు మాత్రమే

స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam