DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యోగా డే . .ఢిల్లీ నుంచి గల్లీ వరకూ  అన్ని చోట్లా. . . .ఆన్ లైనే

*విశాఖ లో ఎమ్మెల్సీ మాధవ, కాకినాడలో యోగ మాస్టర్ రాఘవ  నేతృత్వంలో*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  21, 2020 (డిఎన్ఎస్):* కరోనా మహమ్మారి ప్రభావానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని కార్యక్రమాలూ ఆన్ లైన్ లోనే గడిచి పోతున్నాయి. హిందూ దేవీ దేవతలా ఉత్సవాలు, పండుగలు,

చదువు, చట్టబండలు, అన్నీ కూడా ఆన్ లైన్ లోనే గడిచిపోతున్నాయి. ఆదివారం 6 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం కూడా ఆన్ లైన్ ఖాతాలోకే వెల్లిపాయింది. ప్రపంచ దేశాలకు అలవాటు చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన శుభాకాంక్షలను సైతం ఈ ఏడాది ఆన్ లైన్ లోనే చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావం నుంచి స్వీయ రక్షణ

చేసుకోడానికి ఆరోగ్య పుష్టి అవసరమని, యోగా ద్వారా దాన్ని సాధించవచ్చన్నారు. 

విశాఖలో ఎమ్మెల్సీ మాధవ:

విశాఖపట్నం కేంద్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, తన నివాస ప్రాంగణం లోనే,  యోగ భారతి యోగ శిక్షణ కేంద్రం నిర్వాహకులు పైడిం నాయుడు ఆధ్వర్యవం లో  అతి తక్కువ సభ్యులతో కనీస దూరం

పాటిస్తూ యోగ సాధన చేశారు. 

కాకినాడలో యోగ మాస్టర్ రాఘవ. . .:

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లోని పతంజలి యోగ కేంద్రం లో జిల్లా అధ్యక్షులు రాఘవానంద ముడుంబా శిక్షణ లో అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఆదివారం యోగసాధన చేసారు. ఈ కేంద్రం ఆధ్వర్యవం లో జిల్లాలోనే కాక ఆన్ లైన్ ద్వారా వేలాది మంది యోగ సాధకులు

తయారయ్యారు. ప్రత్యేకించి రాఘవానంద పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు, ఉదయం వేళల్లో పార్క్ ల్లో వాకర్స్ కు యోగ సాధనపై ఆగవాహన కల్పించి వారందరినీ యోగ సాధకులుగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయం కావడంతో ఆన్ లైన్ ద్వారా యోగ ఛాలెంజ్ లు కూడా నిర్వహిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam