DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కల్నల్ సంతోష్ కుటుంబానికి బాసటగా తెలంగాణ ప్రభుత్వం

*5 కోట్ల ఆర్ధిక సహకారం స్వయంగా అందించిన సీఎం కేసీఆర్ *

*సూర్యపేట లో కల్నల్ కాంస్య, పాత బస్టాండ్ జంక్షన్ కు పేరు*

*కల్నల్ కుటుంబానికి రూ. 35 లక్షల పిఎల్ఐను అందించిన పిఎంజి*   

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  22, 2020 (డిఎన్ఎస్):*  భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన

యుద్ధంలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు సోమవారం కల్నల్ ఇంటికి వెళ్లారు. సోమవారం కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం, వారికి ఆర్ధికంగా సహకారంతో పాటు, అతని శ్రీమతి కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం స్ఫూర్తిగా నిలిచింది. కేసీఆర్ ముందుగా

ప్రకటించిన విదంగా గ్రూప్-1 ఉద్యోగపు ఉత్తర్వులు, హైదరాబాద్ లో 711 గజాల ఇంటి స్థలం, రూ. 5 కోట్ల నగదు ను అందజేశారు.

సోమవారం కల్నల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ వెంట రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం మంత్రి మాట్లాడుతూ కల్నల్ కాంస్య విగ్రహాన్ని

సూర్యపేట లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సూర్యపేట పాత బస్ స్టాండ్-కోర్టు జంక్షన్ రహదారికి ఆయన పేరును పెట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. త్యాగదనులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

అందులో భాగంగానే కల్నల్ సంతోష్ బాబు కుటుంబంతో పాటు యావత్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమరలకు

సైతం ఆర్థిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారన్నారు. బంజారాహిల్స్ లో 711 గజాల యింటి స్థలానికి సంబంధించిన దస్తావేజులను అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగనికి సంబందించి సంతోష్ బాబు సతీమణి సంతోషి కోరుకున్న శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్

హామీయిచ్చారన్నారు.

పోస్టల్ శాఖా సహకారం: . . .

కల్నల్ సంతోష్ కుటుంబానికి పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్  రూ..35 లక్షల  చెక్ ను   పోస్టుమాస్టర్ జనరల్  విద్యాసాగర్ రెడ్డి అందించారు. 

సీఎం కేసీఆర్ భరోసా ధైర్యాన్నినింపింది : సంతోషి. 

తమ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి లకు రుణపడి ఉంటామని కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి పేర్కొన్నారు. కష్టం లో ఉన్న తమ కుటుంబానికి అండగా నిలబడి భరోసా ఇవ్వడం కొండంత మనో ధైర్యాన్ని పెంచిదన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam