DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బివికె లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్,  విశాఖపట్నం)*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  23, 2020 (డిఎన్ఎస్):* పదవతరగతి పాసైన విద్యార్థులకు ఇంటర్ మీడియటే విద్య లో ప్రవేశాలకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బివికె జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి తెలిపారు. మంగళవారం కళాశాలలో

నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు అత్యంత సురక్షితమైన వాతావరణంలో, శానిటైజేషన్ చేయబడిన తరగతిగదిలో పరిమితమైన విద్యార్థులతో ప్రతి తరగతి ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రవేశ దరఖాస్తులను తమ కళాశాల

కార్యాలయం నుంచి పొందవచ్చన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో, తరగతులు నిర్వహించబడుతున్నాయన్నారు. తమ కళాశాలలో ఎంపీ సి, బై పిసి, ఎం ఈ సి, సి ఈ సి, హెచ్ ఈ కామ్ హెచ్ ఈ సి, హెచ్ ఎం సి, విభాగాల్లో గ్రూప్ లను నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో జరుగుతున్నాయన్నారు. ఆధునిక పరిశోధన శాలలు అందుబాటులో

ఉన్నాయన్నారు. 
 అదనపు ఆకర్షణగా విద్యార్థులకు సత్సంప్రదాయ విద్యతో పాటు, సంగీత విద్య, క్రీడలు, నేర్పించబడుతున్నాయన్నారు.  విలేకరుల సమావేశంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam