DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విదేశీ కరోనా రోగానికి స్వదేశీ పతంజలి ఆయుర్వేద మందు విడుదల

*కరోనా కు ముందుగా కట్టడి చేసింది భారతీయ ఆయుర్వేదమే* 

*దివ్య కోరోనీల్ టాబ్లెట్ విడుదల చేసిన పతంజలి ఆయుర్వేద కేంద్రం* 

*14 రోజుల్లో కరోనాకు కట్టడి. . ఆపై పూర్తిగా కనుమరుగు: బాబా రాందేవ్*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

హరిద్వార్ / విశాఖపట్నం,  జూన్  23, 2020 (డిఎన్ఎస్):*

 విదేశీ కరోనా రోగానికి స్వదేశీ పతంజలి ఆయుర్వేద పరిశోధన సంస్థ మందును విడుదల చేసింది. హరిద్వార్ లోని పతంజలి యోగ పరిశోధన కేంద్రంలో జరిగిన కార్యక్రమం లో ఈ మందు తయారీలో వినియోగించిన ఆయుర్వేద సామాగ్రి, బాధితులు వినియోగించవలసిన ప్రక్రియను పరిశోధన సంస్థ ప్రతినిధి ఆచార్య బాలకృష్ణ వివరించారు. 

ప్రధానమంత్రి

నరేంద్ర మోడీ పిలుపు మేరకు తమ సంస్థ దశాబ్దాల కాలం నుంచే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో నే ఎన్నో అద్భుతాలను సృష్టించినట్టు తెలిపారు. దానిలో భాగంగానే విదేశాల నుంచి దిగులమటి అయినా కరోనా రోగాన్ని అరికట్టేందుకు మందు స్వదేశీ భారతీయ ఆయుర్వేద విజ్ఞానాన్ని వినియోగించామన్నారు. తమ సంస్థ తయారు చేసే ప్రతి ఉత్పత్తి లోనూ

స్వదేశీ ఆయుర్వేద సంప్రదాయ పరమైన విజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవన్నారు. మన ఋషులు ఏనాడో అందించిన విజ్ఞానాన్ని తాము అమలు చేస్తున్నట్టు తెలిపారు. 

‘కొరోనిల్‌’ పేరుతో ఈ మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌ తెలిపారు.

హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాందేవ్‌ మాట్లాడుతూ...
‘కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం

మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం’ అని రాందేవ్‌ పేర్కొన్నారు.

‘కొరోనిల్’‌ మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. కరోనావైరస్‌కు మందును తీసుకువస్తున్నామని

గతంలోనే పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కొవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.


దివ్య కొరొనిల్:   పతంజలి వారి యాంటీ కొవిడ్ టాబ్లెట్ ను దివ్య కొరొనిల్ టాబ్లెట్ పేరుతొ విడుదల చేసారు. దీనిలో తిప్పతీగ, తులసి, అశ్వగంధ మిశ్రమం ఉందని, రోజుకు మూడు సార్లు వేడి నీటి తో ఉదయం

అల్పాహారం తర్వాత, మధ్యాహ్న భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత తీసుకోవాలి. 

దీనితో పాటు గా దివ్య శ్వాసరి వాటి, పతంజలి తిప్పతీగ ఘన్ వాటి, పతంజలి అశ్వగంధ క్యాప్సూల్,  లేదా 

దివ్య అశ్వగంధ ఘన్ వాటి, పతంజలి ఘన్ వాటి , దివ్య అను తైల, దివ్య శ్వాసరి వాటి (శ్వాస థెరపీ) వాడవలసి ఉంటుంది. 

అదనపు శక్తి,

వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు: . . .

పతంజలి సంస్థ  శ్వాసరి క్వాత్,  అశ్వశిల క్యాప్స్యూల్, చ్యవన ప్రశ్, తేనే, ఇమ్మ్యూనో ఛార్జ్ , ఆలో వీర, తిప్పతీగ రసం, శిలాజిత్ క్యాప్సూల్, శిలాజిత్ సత్ తో పసుపు కలిపి  1 - 1 చుక్క, లేదా పాలతో కలిపి పతంజలి ప్యూర్ కేసరి ని తీసుకోవాల్సి ఉంటుంది. 

ఉత్పత్తులను

మంగళవారం విడుదల చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వ అనుమతులను ఇంతకూ ముందే పొందినట్టు బాబా రాందేవ్ ముందుగానే ప్రకటించారు. అయితే సాధారణ ప్రజా జీవనం లోకి ఇప్పడి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే విషయం త్వరలోనే తెలియనుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam