DNS Media | Latest News, Breaking News And Update In Telugu

25  నుంచి తూర్పు గోదావరి జిల్లా మొత్తం మళ్లీ లాక్‌ డౌన్‌ అమలు

*ఉదయం 6 నుంచి 11 వరకే తిరిగేందుకు అనుమతి.* 

*ఈ సారి మరింత కఠినంగా అమలు చేస్తాం: కలెక్టర్ మురళీధర్ రెడ్డి* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  23, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా కరోనా పాజిటివ్ కేసులు ద్విగుణం, బహుళం అవుతున్న తరుణంలో జిల్లా వ్యాప్తంగా మరోసారి

పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. 

ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు మాత్రమే బయట సామాగ్రి తెచ్చుకోడానికి అనుమతి ఇస్తామని, ఆపై  అనుమతి లేకుండా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు అమలు చేస్తామన్నారు. ఇప్పడికే జిల్లా లోని బిక్కవోలు, గొల్లల మామిడాడ,

అమలాపురం, అయినవిల్లి తదితర ప్రాంతాల్లో అధికమవడంతో పాటు మరణాలు కూడా ఉండడంతో కఠిన చర్యలు తప్పడం లేదన్నారు. 

అన్ని అత్యవసర సేవలైన మెడికల్, పాలు మాత్రం యధావిధిగా అందుబాటులో ఉంటాయి.  

అన్ని  ప్రార్ధన మందిరాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ కేవలం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే పనిచేస్తాయి. 
   
/> విద్య సంస్థలు, కళాశాలలు, పూర్తిగా మూసివేయబడతాయి.

ప్రజా రవాణా వాహనాలకు ఎటువంటి అనుమతి ఇవ్వడం కుదరదు. అవి తిరగడానికి అనుమతి లేదు. 

ఇతర జిల్లాలకు, ప్రాంతాలకు వెళ్లేందుకు వైద్య సదుపాయం మినహా ఎట్టి పరిస్థితిలోనూ వాహన పాస్ లు ఇవ్వడం కుదరదు. 

బహిరంగ ప్రదేశాల్లో మద్యం త్రాగడం, పాన్, గుట్కా,

పుగాకు లాంటివి వాడకూడదు. 

అన్ని మద్యం దుకాణాలు ఉదయం 11 గంటలకే మూసి వెయ్యడం జరుగుతుంది. 

వీధుల్లో అమ్మకాలు సాగించే వారి ఉదయం 11 గంటల తరవాత తిరగరాదు. 

ఇతర జిలాలకు తిరగడానికి అనుమతి లేదన్నారు. 

అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు పనిచేస్తాయి.

కంటైన్ మెంట్ జోన్ లో

లేని ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు లు పని చేస్తాయి. 

ఫంక్షన్ లు జరుపుకోవాలంటే తాసీల్దార్ అనుమతి తో కేవలం 10 మంది లోపుగానే జరుపుకోవాలి.

ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ముఖానికి కచ్చితంగా మాస్క్ ఉండాలి. మాస్క్ లేకుంటే గ్రామాల్లో  రూ. 50 లు, పట్టణాల్లో రూ. 100 జరిమానా విధించడం

జరుగుతుంది.

ఉద్యోగస్తులు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 

బహిరంగంగా ఇల్లబయట గుంపుగా మాట్లాడుకోవడం నిషేధం

అంత్యక్రియలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది.     

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam