DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికార పార్టీ వాళ్ళు పెట్టిన గగ్గోలు పూర్తిగా వృధా.: .ఎంపీ సుజనా చౌదరి

*సీసీ క్లిప్ లపై మండిపడ్డ  రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి.*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  24, 2020 (డిఎన్ఎస్):*  అధికారం వచ్చిందన్న ఆనందంలో కనీసం ఇంగితం కూడా లేకుండా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రతినిధులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీజేపీ కె చెందిన రాజ్య సభ

సభ్యులు సుజనా చౌదరి మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, తానూ రహస్యంగా సమావేశం జరిపినట్టు అధికార పార్టీ వాళ్ళు గగ్గోలు పెట్టి తనను యాగీ చేసేందుకు చేసిన ప్రయత్నం పూర్తి గా వృధా అన్నారు. 

లాక్ డౌన్

ప్రకటించిన నాటి నుంచి తానూ తన కార్యాలయ, వ్యాపార అధికారిక సమావేశాలన్నింటినీ బంజారాహిల్స్ లోని  పార్క్ హయత్ నుంచే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అక్కడే ఒక కార్యాలయం ప్రారంభించి, కార్యకలాపాలన్నీ సాగుతున్నాయన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. పైగా హోటల్ వాళ్ళని అడిగితె కూడా చెప్తారన్నారు. 
అక్కడే వివిధ

రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు నన్ను కలుస్తున్నారు. అవి ఎంతమాత్రం కూడా రహస్య సమావేశాలు కాదు. నా కార్యకలాపాలను, సమావేశాలను రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం కూడా నాకు లేదు.

ఈ నెల 13వ తేదీన తనను కలిసేందుకు మాజీమంత్రి కామినేని ముందుగానే అప్పాయింట్మెంట్ తీసుకున్నారని, ఆంధ్ర

ప్రదేశ్ లో బీజేపీ రాజకీయ అంశాలపై తాము ఇరువురు చర్చించినట్టు తెలిపారు. 

ఇక రమేష్ కుమార్ తనకు సమీప కుటుంబ బంధువని, అదే రోజు రమేష్ కుమార్ గారు కూడా నన్ను కలవాలని అడిగారు. 

వారిద్దరు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు విషయాలపై నాతో సమావేశమయ్యారు. అవి ఎంతమాత్రం రహస్య సమావేశాలు కాదు. కామినేని గారితో ఎపి

పార్టీ వ్యవహారాలు మాట్లాడ్డం జరిగింది. ఆయన వెళ్లాక రమేష్ కుమార్ గారు కలిశారు. ఆయన మా కుటుంబానికి ఎంతో కాలంగా మిత్రులు. ఆయనతో ప్రత్యేకించి ఇటీవల పరిణామాలు గానీ, ఆయన విధి నిర్వహణకు సంబంధించిన విషయాలు కానీ చర్చించలేదు. 

సదరు హోటల్లోని సిసి టివి ఫుటేజ్ ని కూడా ప్రసారం చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడను

కట్టేయమన్న చందంగా పలువురు వైసిపి నేతలు కూడా దీనిపై వారి స్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

దీనికి, రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడేవారు, వారి నేలబారు మనస్తత్వాలను బయటపెట్టుకున్నట్టే. నలుగురు కలిసి మాట్లాడుకుంటే కుట్రలు చేయడమే అనుకోవడం వారి దిగజారిన స్థాయిని తెలుపుతుంది. 

ఈ రకమైన బురద

రాజకీయాలు చేసేవారితో గుంటలోకి దిగి వారితో కలబడి కుస్తీ పట్టడం నాకు అలవాటు లేదు, అది నా స్థాయి కాదు. 

నేనెప్పుడూ ఓపెన్ గానే వుంటాను. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. రహస్య కార్యకలాపాలు నేను చెయ్యను, చేయాల్సిన అవసరం నాకు లేదు. 

అయితే కొన్ని మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు సిసి ఫుటేజ్

చూపించి మేము ముగ్గురం సమావేశమయ్యామని, ఏదో గూడుపుఠాని వ్యవహారం నడిపామని, చట్టవిరుద్ధ చర్యలు చేపట్టామన్నంతగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రసారాలు 
చేసి, ప్రజలకు భ్రమ కల్పించే ప్రయతం చేసాయన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam