DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ ప్రభుత్వం చాల అంశాల్లో విఫలం అయ్యింది: మాజీ ఎంపీ ఉండవల్లి

*కరోనా కట్టడిలో కఠిన వైఖరి అమలులో జగన్ ప్రభుత్వం విఫలం* 

*మాస్క్ లు ముఖానికి వేసుకోవాలి, మెడలో కాదు,* 

ప్రభుత్వం కంటే పార్టీని నడపడమే కత్తిమీద సాము లాంటిది 

మాస్క్ లేనివారికి ఫైన్ వేసేవారు మాస్క్ ఎందుకు పెట్టుకోవట్లేదు?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఘాటు

విమర్శలు 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి). . .

*అమరావతి,  జూన్  24, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఏడాది పాలనా లో చాలా అంశాల్లో ఘోరంగా విఫలం అయ్యిందని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో జగన్

ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్నప్పటికీ కఠిన నిర్ణయం తీసుకోవడం లో వెనకడుగు ఎందుకు వేస్తున్నారో తెలియాలన్నారు. రాష్ట్ర ప్రజలు దేశ చరిత్రలోనే ఏ నాయకున్ని

నమ్మనంత గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని నమ్మి దాదాపు మొత్తం అసెంబ్లీ సీట్లు అన్నీ కట్టబెట్టారన్నారు. అలాంటప్పుడు అతను ప్రజలకు ఎంతో  విశ్వాసంగా ఉండాలన్నారు.  అయితే ప్రజల సంరక్షణ కంటే సోషల్ మీడియా లో 
ప్రతిపక్షాల పోస్టింగ్ ల పైనే అతను ఎక్కువ ద్రుష్టి పెట్టినట్టు ఉందన్నారు. 

కరోనా నేపథ్యంలో ప్రజలతో

సహా, చాలా మంది ప్రజా ప్రతినిధులే నియమనిబంధనలు పాటించడంలేదని, మాస్క్ లను ముఖానికి కాకుండా మెడలో వేసుకునే  మహానుభావులు కూడా ప్రజా ప్రతినిధుల్లో ఉన్నారన్నారని విమర్శించారు. 

ప్రభుత్వం నడపడం కంటే ఒక పార్టీని నడపడమే అత్యంత కష్టమైనా పని అన్నారు. ప్రభుత్వం నడిపేందుకు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు

ఉంటారని, అయితే పార్టీ నడపాలంటే అధ్యక్షుడు ఒక్కడే చేయాలన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదన్నారు. 

ఎవ్వరైనా కోర్టుల ఆదేశాలకు లోబడే పనిచేయాలన్నారు. కోర్టులను తప్పు పట్టకూడదని, అయితే రాజ్యాంగ పరంగా నడుచుకోవాలన్నారు. గతంలో భారత రాష్ట్రపతిగా ఉన్న వివి గిరి సైతం తన రాష్ట్రపతి

ఎన్నిక పై వచ్చిన అభియోగంపై వివరణ ఇచ్చుకునేందుకు నేరుగా సుప్రీం కోర్టు కు వచ్చిన దేశం మనది అన్నారు. అదే విధంగా ప్రపంచ మేధావి, అపరచాణుక్యుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు తనపై వచ్చిన అభియోగాలకు వివరణ ఇచ్చుకునేందుకు కోర్టుకు వచ్చి తగిన సంజాయిషీ ఇచ్చుకున్న తర్వాతే బెయిల్ కు దరఖాస్తు చేసిన సందర్భాలను

వివరించారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో ఎక్కువగా తిరిగే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వాలంటీర్లు, ఆశావర్కర్లు, మీడియా ప్రతినిధులు అందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఉండవల్లి సూచించారు. మాస్కు వేసుకోకపోతే ఫైన్ వేస్తున్న అధికారులు వాళ్లు ఎందుకు మాస్కులు ధరించడంలేదని ఉండవల్లి

ప్రశ్నించారు. 

ముందుచూపు లేకే నిర్మాణ రంగం కుదేలు: . .. .

ప్రభుత్వానికి ఇసుక విధానంపై ముందుచూపు లేద‌ని, ఏపీలో నిర్మాణ రంగం కుదేలైపోయింద‌ని ఉండవల్లి ఆరోపించారు. ఆవ భూములను రూ. 45 లక్షలు పెట్టి కొనుగోలు చేశారని, అంత ధర ఉండదని, దానిపై విచారణ జరిపించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానని మాజీ ఎంపీ ఉండవల్లి

అరుణ్ కుమార్ అన్నారు. కాగా అదే ధరకు ఎక్కడ భూములు ఇచ్చినా కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించారన్నారు. 

అన్ని నిబంధనల ప్రకారమే జరిగిందని, మూడు శాతం మాత్రమే ఎక్కువ పెంచడం జరిగిందని ఆర్థికశాఖ మంత్రి చెప్పారన్నారు.  అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పిన సీఎం జగన్.. ల్యాండ్

విషయంలో జరిగిన అవినీతిని ఎందుకు సమర్ధించారని ఆయన ప్రశ్నించారు. 

ఇది ప్రభుత్వం అసమర్థత కాదా అని నిలదీశారు. అధిక ద‌ర‌ల‌కు భూములు కొని, ఇళ్ల ప‌ట్టాలు ఇస్తాన‌న‌టం ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త‌కు నిద‌ర్శ‌నం అని అన్నారు. 

గురువారం నుంచి జిల్లాలో అమలవుతున్న లాక్ డౌన్ లో నైనా ప్రజలు, పాలకులు,

అధికారులు అందరూ బాధ్యతతో వ్యవహరించి, కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam