DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లా పోలీస్ ఎస్పీ స్పందన కు 32 ఫిర్యాదులు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 29, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమం లో జిల్లా నుండి 32 మంది ఫిర్యాదిదారులు తమ అభ్యర్థనలను వ్రాతపూర్వకంగా,

భౌతిక దూరం పాటిస్తూ అందించారు. వీటిని ఎస్పీ సానుకూలంగా పరిశీలించారు. వీటిలో సివిల్ తగాదాలకు సంబందించినవి 8 ఫిర్యాదులు, కుటుంబ తగాదాలకు సంబందించినవి 5 పిర్యాదులు, పాత పిర్యాదు పై 5 పిర్యాదులు , ఇతరములు సంబందించినవి 14 పిర్యాదులు ఉన్నట్టు పోలీస్ అధికారులు తెలియచేసారు.  
ఈ సందర్భంగా వారి సమస్యలను అవగాహన చేసుకొని, ఆ

సమస్యలను తక్షణమే సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరచి, వెంటనే తగు చర్యలు తీసుకోవలసిందిగా ఎస్పీ అమిత్ బర్డర్ ఆదేశాలు జారీ చేసారు. ఫిర్యాది దారులకు చట్టపరమైన సత్వర న్యాయం అందించవలసిందిగా ఆదేశించారు. ఈ  పిర్యాదులు పై తీసుకున్న చర్యలపై కూడా, తనకు ఎప్పటికప్పుడు నివేదిక అందించవలసిందిగా

అధికారులకు ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam