DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

11 à°¨ పోలవరం పర్యటనకు  à°•à±‡à°‚ద్ర మంత్రి గడ్కరీ : ఎంపీ హరిబాబు

విశాఖపట్నం, జులై 9 , 2018 (DNS Online ): ఈ నెల 12 , 13 తేదీల్లో నగర పర్యటనకు కేంద్ర నౌకా రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

రానున్న సందర్బంగా విశాఖ అభివృద్ధి à°•à°¿ మరిన్ని నిధులు వచ్చేలా  à°•à±‹à°°à°¡à°‚ జరుగుతుందని విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గ శాసన సభ్యులు పి విష్ణుకుమార్ రాజు తెలిపారు.

సోమవారం నగరం లోని ఎం వీ పీ కోలనీ లోని ఎంపీ కార్యాలయం లో జరిగిన నగర పార్టీ కార్యవర్గ సమావేశం లో అయన మాట్లాడుతూ, ప్రస్తుత సమయం లో గతం లో ఇచ్చిన హామీలకు మించి

ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ నిధులు కేటాయించినప్పటికీ వాటిని విస్తృతం గా ప్రచారం చేసి, ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లో పార్టీ వైఫల్యం

ఉండనే విషయం బహిర్గతమైందన్నారు. అయినప్పటికీ, వార్దు స్థాయిలో ప్రతీ కార్యకర్త బీజేపీ ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను, నెరవేర్చిన ఫలితాలను ప్రచారం

చేసినట్టయితే కొంతవరకూ నష్టాన్ని పూడ్చుకోవచ్చన్నారు.           

విశాఖ యంపి డా.కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోలవరం సందర్శించి

విశాఖ రానున్నారన్నారు.  à°œà±‚లై 11à°µ తేదీన సాయిప్రియ రిసార్ట్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ నగర పదాదికారులు, రాష్ట్ర పదాదికారులు కార్యకర్తలు,నాయకులతో సమావేశమై

పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు,కేంద్రం ఇచ్చిన నిధులు వివరాలు తెలియ చేస్తారని తెలిపారు. 12 వ తేదీన పోర్టు కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు.13వ

తేదీన విశాఖనగరం "AU కన్వెన్షన్ సెంటర్ బీచ్ రోడ్" ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.. ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు కార్యకర్తలు వేలసంఖ్యలో

హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేసారు...

ఉత్తరాంధ్ర యమ్మెల్సి పివియన్ మాధవ్ మాట్లాడుతూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారు జూలై 11,12,13

తేదీలలో మూడురోజుల పాటు విశాఖనగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని,వారి విశాఖ పర్యటన విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర

కార్యవర్గసభ్యులు పివి నారాయణరావు ,బుధ్ధా లక్ష్మీనారాయణ, పృధ్వీరాజ్, ప్రకాశరెడ్డి, నగర అధ్యక్ష ప్రధానకార్యదర్శిలు అప్పలకొండయాదవ్ ,కేశవకాంత్, బిజెపి నగర

పదాదికారులు, వివిధ మోర్చల నాయకులు హాజరైనారు .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam