DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజారక్షణ లో పరిపూర్ణ అవతారం లో జగన్నాధుని దర్శనం

*శ్రీకృష్ణావతారం లో విశాఖ లో జగన్నాధ సాక్షాత్కారం* 

*విశాఖ లో వైభవంగా కొనసాగుతున్న జగన్నాధ ఉత్సవాలు..*
 
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూన్  30, 2020 (డిఎన్ఎస్):* భూలోక రక్షణకై ద్వాపరయుగం లో అవతరించిన పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఈ

మానవుని మనుగడకే ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో సర్వజన రక్షణకై జగన్నాధుడు శ్రీకృష్ణ రూపంలో అనుగ్రహిస్తున్నాడు. 
విశాఖపట్నం లోని వన్ టౌన్ కొత్తరోడ్డు లో గల శ్రీ జగన్నాధ స్వామీ ఆలయ వార్షిక ఆషాఢ మసోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీకృష్ణావతారం లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులను స్వామి దర్శనాన్ని

కల్గిస్తున్నట్టు ఆలయ ఈఓ కె. శిరీష తెలిపారు. కోవిడ్ 19  రక్షణ నిబంధనల ప్రకారం కారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నట్టు తెలియచేసారు. 

అత్యంత భాద్యతలో ఉండవలసిందిగా భక్తులను కోరుతున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య రక్షణ కోసం ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన

ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తులు కూడా పరధ్యానం లో ఉండవద్దని సూచించారు.  అందరి రక్షణ భాద్యతలను స్వామి చూసుకుంటున్నప్పడికీ, మన భాద్యతలను మనం విస్మరించి కూడదన్నారు. 

పూర్తి ఏకాంతంలోనే. . : 

మంగళవారం ( జూన్ 25 న) దేశ వ్యాప్తంగా ఆరంభమైన ఉత్సవాలు గతం లో నిర్వహించిన రీతిలో కాక, ఏకాంతంలో

నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖలు ఇచ్చిన ఆదేశాల మేరకు భక్తులను కేవలం దర్శనానికి మాత్రమే అనుమతించడం జరిగిందన్నారు. రక్షణ చర్యలు అన్ని నిబంధనల ప్రకారమే చేపట్టామన్నారు. 

ఆలయ అర్చకులు జగన్నాధాచార్యులు, ఆనందాచార్యుల పర్యవేక్షణలో ప్రత్యేక ఆరాధనలు, నిత్యా అర్చనలు నిర్వహించిన అనంతరం ఉదయం 6 :30

గంటల నుంచి మత్సావతర అలంకారంలోని  జగన్నాధ స్వామి దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు. 
ఈ వేడుకలు జులై 3 వరకూ ఆలయంలోనే ఇదే ప్రాంగణం లో నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఉదయం 6 :30 గంటల నుంచి సాయంత్రం వరకూ దర్శనం లభిస్తుందన్నారు. 
రెండవ రోజు నుంచి జగన్నాధుడు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, అవతారాల్లో

దర్శనం ఇచ్చినట్టు జగన్నాధ స్వామి ఆలయ అర్చకులు జగన్నాధాచార్యులు, ఆనందాచార్యులు తెలియచేసారు. 

ఈ వేడుకల్లో భాగంగా బుధవారం స్వామీ ధర్మానికి ప్రతిరూపమైన శేషపాన్పు పై దర్శనం అనుగ్రహించనున్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam