DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నడిగడ్డ పాలెంలో చిన్న జీయర్ స్వామి చాతుర్మాస్య దీక్ష 

ఎనిమిది మంది జీయర్లకు విద్య నేర్పిన ప్రాంగణం ఇదే. . .

పెద్ద జీయర్ స్వామి కి అత్యంత ప్రీతికరమైనది ఈ  ఆశ్రమమే. .

అహోబిల జీయర్ స్వామి కూడా ఇదే ప్రాంగణం లోనే దీక్ష  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 01, 2020 (డిఎన్ఎస్):* ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత

ప్రవర్తకులు, ప్రపంచ దేశాల్లో సైతం విశిష్టాద్వైత ప్రచారాన్ని అనిర్వచనీయంగా నిర్వహిస్తున్న త్రిదండి చిన్న జీయర్ స్వామి 2020 లో చాతుర్మాస్య దీక్షను గుంటూరు జిల్లా నడిగడ్డపాలెం లోని వాసుదాసా ఆశ్రమం లో అనుగ్రహించనున్నారు. ఈ నెల 5 వ తేదీ ఆషాఢ పౌర్ణమి నుంచి దీక్ష స్వీకారం చేపట్టనున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు

తెలియచేస్తున్నారు. ఈ మేరకు రానున్న రెండు నెలల కాలం లో చేపట్టవలసిన కార్యాచరణను ఇప్పడికే సిద్ధం చేసారు. చాలా ఏళ్ళ తర్వాత ఈ ఆశ్రమ ప్రాంగంలో చిన్న జీయర్ స్వామి చాతుర్మాస్య దీక్షను నిర్వహిస్తుండడంతో ఆశ్రమం లో పండుగ వాతావరణం నెలకొంది. 

ఎనిమిది మంది జీయర్లకు విద్యాభ్యాసం ఇక్కడే: 

ఆంధ్ర ప్రదేశ్,

సహా ఇతర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది జీయర్ స్వాములకు ఉభయ వేదాంత ( తమిళం, సంస్కృతం) విద్యాభ్యాసం జరిగింది ఈ నడిగడ్డపాలెం లోని వసుదాసాశ్రమం లోనే. చిన్న జీయర్ స్వామి తమ ఆశ్రమ స్వీకార ప్రారంభంలో విద్యాభ్యాసాన్ని ఇక్కడే పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఆశ్రమ నిర్వహణ వీరి ఆచార్యులు టి కె గోపాలాచార్యుల ప్రత్యక్ష

పర్యవేక్షణలో ఎనిమిది మంది జీయర్ స్వాముల విద్య వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభచింది ఈ ఆశ్రమమే. 
చిన్న జీయర్ స్వామి పూర్వాశ్రమ తాతగారు, పెద్ద జీయర్ స్వామి గా పేరుగాంచిన త్రిదండి రామానుజ పెద్ద జీయర్ స్వామికి అత్యంత ప్రీతికరమైన ప్రాంగణం ఇదే. దీనికి  ప్రధాన కారణం వారి సన్నిహితులు గోపాలాచార్యులు ఇక్కడ ఉండడమే నని

చిన్న జీయర్ స్వామి ఎన్నో పర్యాయాలు తెలియచేసారు. 

 సెప్టెంబర్ 2  (భాద్రపద పౌర్ణమి) వరకూ సాగనున్న ఈ దీక్షలో నిత్యా అనుష్ఠానం, తిరువారాధనలు, గ్రంథ పఠనం, కేవలం పరిమితి సంఖ్యలో భక్తులకు పలు కార్యక్రమాల్లో మాత్రమే ప్రవేశం కల్పించడం తో పాటు, స్వచ్చంద సేవ కార్యక్రమాలైన వికాస తరంగిణి, ఆరోగ్య తరంగిణి, మహిళా

వికాసం, గో సంరక్షణ, అన్న ప్రసాద వితరణ, రక్తదాన శిబిరం, అవయవ దాన ప్రక్రియ పై అవగాహనా వంటి ఎన్నో సదస్సులను జీయర్ స్వామి ప్రత్యక్షంగా అనుగ్రహించనున్నారు. 

వీరి శిష్యులు అహోబిల జీయర్ స్వామి సైతం వీరిని అనుసరిస్తూ ఇదే ప్రాంగణం లో తమ చాతుర్మాస్య దీక్షను కొనసాగించనున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam