DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సువిశాల భారత దేశ కీర్తి ప్రతిష్టను కలిసి కాపాడదాం:

*మీకు అండగా, వెన్ను దన్నుగా నిలబడుతున్నా*  

*భరతమాతకు, మీ కన్నతల్లి కి పాదాభివందనం : మోడీ*  

*మోడీ రాకతో రెట్టింపైన లడక్ లోని భారత సైనిక శిబిరాలు*

*ఝాన్సీలక్ష్మి, శివాజీ ల స్ఫూర్తిగా ముందుకు నడుద్దాం.* 

*లడక్ లో భారత సైనికులకు ప్రధాని మోడీ ఉత్తేజిత

ప్రసంగం* 

*వెళ్ళవలసింది రాజ్ నాధ్ సింగ్, వెళ్ళింది దేశ ప్రధాని మోడీ*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 03, 2020 (డిఎన్ఎస్):* సువిశాల భారత దేశ కీర్తి ప్రతిష్టను కలిసి కాపాడదాం అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లడక్ లోని భారత సైనిక వీరులకు పిలుపునిచ్చారు. శుక్రవారం

లడక్ లో పర్యటన సందర్బంగా అయన భారత పోరాట యోధులనుద్దేశించి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తేజ పూరిత ప్రసంగం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భరతమాత కు, దేశం గర్వించదగించే విధంగా  మిమ్మల్ని దేశ రక్షణ కు పంపిన మీ కన్న తల్లికి పాదాభివందనం చేస్తున్న అనగానే మొత్తం సైనిక శిబిరం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.

ఒక్కసారిగా సైనికులంతా భారత మాతాకీ జై అంటూ, నరేంద్ర మోడీ కి అభివాదం తెలియచేసారు. 

ప్రస్తుతం భారత దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అడుగులు వేస్తోందని, ఒక ప్రక్క కరోనా మహమ్మారి తో అంతర్గతం గా పోరాటం చేస్తోందని, ఇదే అదునుగా పాకిస్తాన్, చైనా లు భారత్ సరిహద్దులు దాటి ఈ భోభాగం లోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం

చేస్తోందన్నారు. భారత దేశం శాంతి కాముక దేశం అని, అయితే మన జోలికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ అపర కాళీ, ఝాన్సీ, రుద్రావతారులుగా రూపుదాల్చాలని పిలుపునిచ్చారు. మీ లాంటి పోరాట యోధులకు అండగా, వెన్ను దన్నుగా నిలుస్తానని, మీతో కొంత సమయం గడిపి మీ నుంచి స్ఫూర్తి పొందేందుకు వచ్చానన్నారు. అత్యంత ఉత్తేజిత పూరిత ప్రసంగం తో భారత

సైనిక శిబిరం లో యువతీ, యువకులైన పోరాట యోధులు మరింత ఉత్సాహాన్ని పొందుతున్నారు. 

వెళ్ళవలసింది రాజ్ నాధ్, వెళ్ళింది ప్రధాని మోడీ. . .

ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ లడక్ సైనిక శిబిరానికి వెళ్ళవలసింది రాజ్ నాధ్ సింగ్. ఈ మేరకు ఏర్పాట్లు అన్నీ సిద్ధమయ్యాయి. అయితే ఆఖరి నిమిషం లో నేరుగా నరేంద్ర

మోడీయే ఈ శిబిరానికి వెళ్లేందుకు సిద్దపడడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కి పోయింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam