DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భవన నిర్మాణ కార్మికులకు కరోనా ఆర్ధిక సాయం

DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)

శ్రీకాకుళం, జూలై 04, 2020 (డిఎన్ఎస్): భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం  కరోనా నేపధ్యంలో ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నట్లు ఆ శాఖ శ్రీకాకుళం జిల్లా సహాయ కమీషనరు సి.హెచ్. పురుషోత్తం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యిందుకు గాను

శ్రీకాకుళం జిల్లాలో గుర్తింపు కార్డు కలిగిన భవన నిర్మాణ, యితర నిర్మాణ రంగంలో పని చేస్తున్న  కార్మికులందరూ వారి యొక్క బ్యాంకు అక్కౌంట్ నెంబరు, ఐ.ఎఫ్.సి.కోడ్ నెంబరులను వారికి దగ్గరలో వున్న కార్మిక శాఖ కార్యాలయంలో ఈ నెల 10 వ తేదీ లోగా అందచేయవలసినదిగా కోరినారు. కార్మికులంతా తమకు దగ్గరలో వున్న లేబర్ ఆఫీసులో కాని, మండల

కార్యాలయంలో కాని, సెక్రటేరియట్ లో కాని రిజిస్ట్రేషన్ కాపీ, ఆధార్ కార్డు, బ్యాంక్ అక్కౌంట్ నెంబరు, ఫోన్ నెంబరు, ఐఎఫ్ఎస్ సి  కోడ్ నెంబర్ల జెరాక్సు కాపీలను అందచేయవలసినదిగా  సహాయ కమీషనరు కోరినారు.  కంటైన్మెంట్ జోన్  పరిధిలో వున్న వారు తమ మొబైల్ వాట్సప్ ద్వారా సదరు  వివరాలను  పంపవలసినదిగా  వై.శైలేష్ కుమార్

అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు ఈ సందర్భంగా తెలియచేసినారు.  కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam