DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగమాలు, వేదాల్లోనే చెప్పిందే ఇప్పుడు విశ్వ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

*మాస్క్, శానిటైజేషన్ ప్రక్రియ ఆగమాల్లో ఏనాడో  చెప్పబడింది.*

*వేల ఏళ్ళ క్రితం హైందవ వేద వాఙ్మయం లోనే ఇవన్నీ చెప్పబడ్డాయి.*

*చాతుర్మాస్య దీక్ష స్వీకరణ లో చిన్న జీయర్ స్వామి వెల్లడి.* 

*మాస్క్ లేకుంటే ఆశ్రమ ప్రాంగణం లోకి ప్రవేశం లేదు : . ..* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో

చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 05, 2020 (డిఎన్ఎస్):* ఏ పని చేసే ముందు అయినా చేతులు జోడించు, చేతులు కడుక్కో, ముఖానికి వస్త్రం కట్టు ఇలాంటి పరిశుభ్ర ప్రక్రియలన్నీ హైందవ ఆగమాలు, వేదాలు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పిందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, శ్రీమదుభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, చిన్న జీయర్ స్వామి

తెలియచేసారు. ఆషాఢ పౌర్ణమి ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా నడిగడ్డ పాలెం లోని శ్రీ వాసుదాసాశ్రమం లో చాతుర్మాస్య దీక్షను స్వీకరించారు. చిన్న జీయర్ స్వామి తో పాటు  వారి శిష్యులు అహోబిల జీయర్ స్వామి దీక్ష ధారణ కావించారు. ఈ వేడుకలను స్వామి వారి వేదపాఠశాలలో విద్యాభ్యాసం చేసిన చిన్నారి వేద విద్యార్థులు నిర్వహించడం

విశేషం. 

ఈ దీక్ష ధారణ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆన్ లైన్ లో ప్రసంగించారు. ఈ సందర్బంగా స్వామిజి మాట్లాడుతూ హైందవ సంప్రదాయ ప్రకారం ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాలు, అర్చనాది కార్యక్రమాల్లో అర్చక నిర్వాహకులు తప్పని సరిగా ముఖానికి వస్త్రం కట్టుకుంటారని, ప్రతి పని ముందూ చేతులను పలుమార్లు పరిశుభ్రం

చేసుకుంటారన్నారు. కేవలం ఎప్పడికప్పుడు వండిన పదార్ధాలని ఆలయాల్లోని దేవీ దేవతలకు నైవేద్యం పెట్టడమే కాక, భక్తులకు కూడా అదే వేడిగా ప్రసాద వితరణ చేయడం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి రాక్షసుని బారి నుంచి స్వీయ రక్షణ చేసుకునేందుకు పాటించమని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయబడుతున్న అంశాలు ఇవేనన్నారు.

 తినే ఆహారాన్ని ఎప్పడికప్పుడు వండుకుని వేడిగా తినండి అని చెప్తున్నారన్నారు. ఇతరులతో కరచాలనం చెయ్యవద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే అమలవుతోందన్నారు.  గతం లో ఇదే విధానాన్ని అంతా హేళన చేసిన రోజులు కూడా ఉన్నాయని, ఇప్పుడు విశ్వమంత్రా ఇదే హిందూ పద్దతులను

పఠిస్తోందన్నారు. 

జంతువులకు కూడా బోలెడు నియమాలున్నాయి. కోతికి అరటి పండు ఇస్తే, దాన్ని పరిశీలించి చూసి, తొక్క ఒలిచి మరీ తింటుంది. అనుమానం వస్తే అస్సలు ముట్టుకోదన్నారు. మనం గుర్తించలేని సూక్ష్మ విషయాలను కూడా జంతువులూ సునిశితంగా గమనిస్తాయన్నారు. మరి మనిషి ఏది పడితే అది నోట్లో వేసేస్తున్నాడని, వారం క్రితం

వండిన పదార్ధాన్ని కూడా ఫ్రిజ్ లో పెట్టి మరీ లొట్టలేసుకు తాగుతున్నదని, ఆపై రోగాల పలు పడుతున్నాడన్నారు. 

యోగనిద్రలో నాలుగు నెలల కాలం శ్రీమహావిష్ణువు ఉండి, సకల మానవాళిని ఎలా రక్షించాలి అనే ప్రణాళికను రచించడం జరుగుతుందన్నారు. 

రాష్ట్ర, దేశ, ప్రపంచ నేతల్లో ఎలాంటి మంచి ఆలోచనలు కలగాలి, మంచి

మార్పులు ఎలా రావాలి అనే విధంగా ఆలోచన స్వామి చేస్తాడని తెలిపారు. 

చాతుర్మాస్య దీక్ష వివరం : . . .. 

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి వరకూ రెండు నెలల కాలం పాటు (నాలుగు పక్ష్యాలు ) చాతుర్మాస్య దీక్షను చేపట్టడం శాస్త్ర సమ్మతం అన్నారు. ఇతర ప్రాంతాల్లో సైతం ధర్మ ప్రచార కార్యక్రమాలను

నిర్వహించే విధంగా ఈ వెసులుబాటును అమలు చేయడం జరుగుతోందన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పరివర్తన (ఒక ప్రక్కకు తిరుగుతాడు) చెందుతాడని, అందువల్ల దీనికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చిందన్నారు.  

ఎనిమిది మంది జీయర్లకు విద్య నేర్పిన ప్రాంగణం ఇదే. . .

చాలా ఏళ్ళ తర్వాత ఈ ఆశ్రమ

ప్రాంగంలో చిన్న జీయర్ స్వామి చాతుర్మాస్య దీక్షను నిర్వహిస్తుండడంతో ఆశ్రమం లో పండుగ వాతావరణం నెలకొంది. 

ఆంధ్ర ప్రదేశ్, సహా ఇతర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది జీయర్ స్వాములకు ఉభయ వేదాంత ( తమిళం, సంస్కృతం) విద్యాభ్యాసం జరిగింది ఈ నడిగడ్డపాలెం లోని వసుదాసాశ్రమం లోనే. చిన్న జీయర్ స్వామి తమ ఆశ్రమ స్వీకార

ప్రారంభంలో విద్యాభ్యాసాన్ని ఇక్కడే పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఆశ్రమ నిర్వహణ వీరి ఆచార్యులు టి కె గోపాలాచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎనిమిది మంది జీయర్ స్వాముల విద్య వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభచింది ఈ ఆశ్రమమే. 
చిన్న జీయర్ స్వామి పూర్వాశ్రమ తాతగారు, పెద్ద జీయర్ స్వామి గా పేరుగాంచిన త్రిదండి రామానుజ పెద్ద

జీయర్ స్వామికి అత్యంత ప్రీతికరమైన ప్రాంగణం ఇదే. దీనికి  ప్రధాన కారణం వారి సన్నిహితులు గోపాలాచార్యులు ఇక్కడ ఉండడమే నని చిన్న జీయర్ స్వామి ఎన్నో పర్యాయాలు తెలియచేసారు. 

మాస్క్ లేకుంటే ఆశ్రమ ప్రవేశం లేదు : . .. 

ప్రతి రోజు ఆశ్రమం లో హోమాలు, జపాలు, వేద పారాయణ, పురాణ ప్రబంధ పఠనం, దివ్య ప్రబంధ (

తిరువాయిమొజి ) పఠనం జరుగుతుంటాయన్నారు. 

ప్రతి రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో 8 : 30 గంటలకు తీర్ధ గోష్ఠి ఉంటుందన్నారు. ఈ గోష్టి కి వచ్చేవారు వ్యక్తిగత శౌచ్యం తప్పక పాటించాలన్నారు. ద్వారం వద్ద కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు ఇస్తారని, అక్కడే శానిటైజర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ముఖానికి మాస్క్

ధరించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యం లో రాత్రి బస ఉండదన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా సాయంత్రం వరకే అనుమతి ఉందన్నారు. ఆశ్రమం నుంచి బస్సులు ఏర్పాటు చేశామని, సమీపం లోని రవాణా సదుపాయం కూడలి వరకూ ఈ బస్సులు నడుస్తాయన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam