DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పరీక్షకు రండి... ఆలస్యం వద్దు: కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 06, 2020 (డిఎన్ఎస్):* కరోనా లక్షణాలు ఉంటే తక్షణం పరీక్షలు చేయించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఆయాసం, రుచి, వాసన తెలియకపోవడం తదితర లక్షణాలు ఉంటే కరోనాగా భావించి పరీక్షలకు

రావాలని, ఆలస్యం చేయవద్దని అన్నారు. ఆలస్యం చేయడం వలన ప్రాణాపాయ స్ధితిలోకి వెళుతున్నారని పేర్కొన్నారు. సంతకవిటి మండల కేంద్రం, ఎం.ఆర్. ఆగ్రహారంలోని కంటైన్మెంటు జోన్ లను కలెక్టర్ సోమ వారం పరిశీలించారు. జిల్లాలో కోవిడ్ చికిత్సకు ఆసుపత్రులు పూర్తి స్ధాయి సౌకర్యాలతో ఉన్నాయని చెప్పారు. కరోనా ప్రభలుతుందని ప్రభుత్వం

హెచ్చరిక జారీ చేసినప్పటి నుండి కరోనా నుండి జిల్లాను రక్షించుటకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని కలెక్టర్ అన్నారు. బయట నుండి వచ్చిన వ్యక్తులు, వేడుకల నిర్వహణ వంటి అంశాల వలన కరోనా మహమ్మారి ప్రభలుతోందని అన్నారు. సామాజిక వ్యాప్తి జరుగుతోందని ప్రజలు గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కంటైన్మెంటు జోన్ లలో

దుకాణాలు తెరవరాదని ఆయన ఆదేశించారు. ప్రజలు రాకపోకలు ఉండరాదని పేర్కొన్నారు. కంటైన్మెంటు జోన్లలో ప్రజలు సూచనలను పక్కాగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. నిత్యావసరాలు, తాగు నీరు, పాలు, పెరుగు వంటి పదార్ధాలు అందేటట్లు చూడాలని ఆయన అన్నారు. కంటైన్మెంటు జోన్లలో ప్రతి ఒక్కరి నమూనా సేకరించి పరీక్షంచాలని ఆదేశించారు. పాజిటివ్

వ్యక్తుల కాంటాక్టులను గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. పాజిటివ్ కేసుల ప్రైమరీ, సెకండరీ కేసులను గుర్తించడం అత్యంత అవసరమన్నారు. కాంటాక్టులను గుర్తించడంలో ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా సామాజిక వ్యాప్తి అతి త్వరగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని ప్రజలు

గమనించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సొంతంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా నమూనాలు సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కరోనా వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని కోరారు. ప్రజలు వివక్ష చూపుతారనే సామాజిక భయంతో కరోనా లక్షణాలు ఉన్నప్పటికి పరీక్షలకు రాకుండా ఉండరాదని

పిలుపునిచ్చారు. పరీక్షలకు ఎంత త్వరగా ముందుకు వస్తే అంత మంచిదని అన్నారు. కరోనా పాజిటివ్ గా గుర్తిస్తే వెంటనే చికిత్స అందుతుందని పేర్కొన్నారు. ఫీవర్ సర్వే పక్కాగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫీవర్ సర్వేలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని ఆయన స్పష్టం చేసారు. ఇంటింటా సర్వే చేసి జ్వరం ఉంటే కరోనా కేసుగా

పరిగణించి వైద్య పరీక్షలు నిర్వహించుటకు చర్యలు చేపట్టాలన్నారు. 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు, వివిధ వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, చేతులు సబ్బుతో గాని, శానిటైజర్ తో గాని శుభ్రపర్చుకోవాలని, భౌతిక దూరం పాటించాలని – ఇవి కరోనా వైరస్ భారీన పడకుండా ప్రాథమికంగా

పాటించాల్సిన నియమాలని చెప్పారు. దీనిని ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. 
    ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ట.వి.ఎస్.జి.కుమార్, మండల ప్రత్యేక అధికారి డా.మాణిక్యరావు,  తహశీల్దారు, ఎం.పి.డి.ఓ, వైద్య అధికారి తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam