DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*కోవిడ్ నిబంధనలు పటిష్టంగా పాటిస్తూ మంత్రి ధర్మాన జన్మదినం*

*శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో మాస్క్ లు, కనీస దూరం తో వేడుకలు* 

*వేడుకలకు సుముఖంగా లేని మంత్రి, పార్టీ నేతల నిర్వహణతోనే. . .*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 07, 2020 (డిఎన్ఎస్):* కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు పటిష్టంగా పాటిస్తూ

శ్రీకాకుళం జిల్లా అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి నేతృత్వంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

ఈ వేడుకల్లో

పాల్గొన్న వారంతా మాస్కులను కంఠానికి కాకుండా ముఖానికి మాత్రమే ధరించి, రెండు అడుగుల కనీస దూరాన్ని పాటిస్తూ పాల్గొని, మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి మంత్రికి అభినందనలు తెలిపారు. కోవిడ్ నిబంధలను అద్భుతంగా పాటిస్తున్న శ్రీకాకుళం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రజలందరూ

అభినందిస్తున్నారు. తాము కూడా వీరి బాటలోనే నడుస్తామని కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. 

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వేడుకలను జరుపుకునేందుకు మంత్రి ధర్మాన కృష్ణదాస్ సుముఖత చూపించని విషయం తెలిసిందే. అయితే పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులూ, కార్యకర్తలు నిర్వహించిన వేడుకలకు అయన

తప్పని సరి పరిస్థితుల్లో హాజరు కావాల్సి వచ్చింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam