DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లాలో లక్ష కరోనా పరీక్షలు పూర్తి : కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 07, 2020 (డిఎన్ఎస్):*

శ్రీకాకుళం, జూలై 7 : జిల్లాలో లక్ష కోవిడ్ 19 పరీక్షలు పూర్తి అయ్యాయి. జిల్లా యంత్రాంగం కోవిడ్ నివారణలో చేపట్టిన చర్యల్లో భాగంగా లక్ష పరీక్షలు పూర్తి చేసంది. ప్రపంచాన్ని పీడిస్తున్న కోవిడ్ మహమ్మారిని జిల్లాలోకి

ప్రవేశించుకుండా జిల్లా కలెక్టర్ జె నివాస్ మార్గదర్శకత్వంలో జిల్లా యంత్రాంగం మొదటి నుండి అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికంగా పరీక్షలు నిర్వహించడం వలన కేసులను త్వరగా గుర్తించ వచ్చనే సూత్రాన్ని పాటిస్తూ

జిల్లాలో పరీక్షల నిర్వహణకు శరవేగంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో మార్చి 5న మూడు నమూనాల సేకరణతో ప్రారంభమైన కరోనా పరీక్షలు మార్చి 30వ తేదీకి రెండు అంకెల దశకు చేరుకుంది. ఏప్రిల్ 4వ తేదీ నుండి దిన దిన ప్రవర్ధమానంగా సాగుతూ రెండు రోజుల్లోనే, ఏప్రిల్ 6వ తేదీన 144 నమూనాలు సేకరించి సెంచరీ రికార్డును సాధించింది. 16వ తేదీన 184 నమూనాలు

సేకరించగా 17వ తేదీన 395 నమూనాలు సేకరించే స్ధాయికి చేరింది. 20వ తేదీకి 5వందల మార్కుకు చేరుకుంది. మే 4 నాటికి రోజుకు వెయ్యి నమూనాలు సేకరించే స్దాయికి చేరి మొత్తం 10,541 నమూనాలు సేకరించి పరీక్షించడం జరిగింది. మే 9వ తేదీ నాటికి 15 వేల మార్కు, మే 13 నాటికి 20 వేల మార్కు, మే 17కి 25 వేల మార్కు, మే 21 నాటికి 30 వేలు, మే 31 నాటికి 45 వేల మార్కు దాటింది.

జూన్ 3వ తేదీ నాటికి 50 వేల మార్కు దాటింది. మూడు నెలల వ్యవధిలో 50 వేలు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించిన యంత్రాంగం నెల రోజుల వ్యవధిలో మరో 50 వేల పరీక్షలు నిర్వహించిన ఘనత దక్కించుకుంది. జూన్ 9 నాటికి 60 వేల మార్కు, జూన్ 24 నాటికి 75 వేల మార్కు, జూలై 7వ తేదీ నాటికి లక్ష నమూనాలు సేకరించి రికార్డు సృష్టించడం జరిగింది. 
  

 నమూనాలు సేకరించిన ప్రారంభంలో హైదరాబాదు, తిరుపతి ఆసుపత్రులలో ల్యాబ్ పరీక్షలకు  పంపించేవారు. కొంత కాలం కాకినాడ అటు తరువాత విశాఖపట్నం పంపించే వారు. ట్రూ నాట్ పరీక్షా కేంద్రాలను స్ధానిక జెమ్స్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులతోపాటు, పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసారు. ఇటీవల టెక్కలి  జిల్లా ఆసుపత్రిలోనూ

ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలను పెద్ద ఎత్తున చేయుటకు జిల్లా కలెక్టర్ నిర్ణయించి అందుకు సాద్యమైన అన్ని అంశాలను పరిశీలించి 8 మోబైల్ విస్క్ లను  ఏర్పాటు చేయడంతోపాటు సామాజిక ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమూనాలు సేకరించుటకు మరో 18 విస్కులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వైరస్ రిసెర్చ్ అండ్

డయాగ్నస్టిక్ లాబ్ (వి.ఆర్.డి.ఎల్)ను శ్రీకాకుళానికి మంజూరు చేయడంతో శరవేగంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసి మే 4 నుండి దాని సేవలను వినియోగించుకోవడం జరుగుతోంది. సహరిహద్దు ప్రాంతాలైన పైడి భీమవరం, ఇచ్ఛాపురం వద్ద వీర లాబ్ (వీల్స్ ఆన్ టెస్టింగు)లను ఏర్పాటు చేసి జిల్లాలో ప్రవేశించే వారికి పరీక్షలు నిర్వహించడం

జరుగుతోంది. అయితే పైడి భీమవరంలో దాదాపు శాశ్వత స్ధాయిలో నమూనాల సేకరణ కేంద్రాన్ని అచ్చట పాఠశాలలో ఏర్పాటు చేసి, వీర ల్యాబ్ సేవలు ఆమదాలవలస మరియు ఇతర ప్రాంతాల్లో వినియోగించడం జరుగుతోంది. కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో చేయడం వలన కరోనా పాజిటివ్ ల సంఖ్య బయటకు వస్తుందని తద్వారా వారికి సరైన చికిత్సను అందించ వచ్చని జిల్లా

కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఆలస్యం చేయడం వలన ప్రాణాపాయ స్ధితి కలుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని కరోనా చికిత్సకు భయపడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేసారు. ఇంటి వద్దనే చికిత్స పొంద వచ్చని జిల్లాలో ఇంటి వద్ద,

కోవిడ్ కేర్ సెంటర్ వద్ద చికిత్స అందిస్తున్నామని, తీవ్రత ఉన్న కేసులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam