DNS Media | Latest News, Breaking News And Update In Telugu

Rytu Bharosa centres for Farmers development, Collector

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 08, 2020 (డిఎన్ఎస్):* రైతన్నల కుటుంబాలలో సౌభాగ్యం వెల్లివిరియడానికే రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేస్తే అందులో 820 రైతు భరోసా

కేంద్రాలను జిల్లాలో ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.           దివంగతనేత డా. వై.యస్.రాజశేఖరరెడ్డి 71వ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమం బుధవారం ఉదయం శ్రీకాకుళం రూరల్ మండలం భైరి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం భైరి గ్రామంలోని రైతు

భరోసా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల కుటుంబాలలో సౌభాగ్యం నింపడానికే రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని చెప్పారు. అపరభగీరధుడుగా  పేరుగాంచిన దివంగతనేత వై.యస్.ఆర్ రైతుల పక్షపాతి అని, రైతన్నల కోసం, వారి అభ్యున్నతికోసం నిరంతరం కృషిచేసే వారన్నారు.

అటువంటి మహానీయుని జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరిపేందుకు ప్రభుత్వం సంకల్పించిదన్నారు. తండ్రి బాటలోనే మన ముఖ్యమంత్రి పయనిస్తూ, రైతుల జీవితాల్లో ఆనందాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అందులో భాగంగానే రైతు భరోసా క్రింద రైతులకు ఆర్ధిక ప్రయోజనం , రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అని గుర్తుచేసారు.

రైతులే దేశానికి వెన్నుముకని, రైతు బాగుంటేనే మనందరం బాగుంటామని భావించి, రైతు నష్టాల బాట నుండి లాభాల వైపు వారి జీవితాలు పయనించాలనేది ముఖ్యమంత్రి తపన అని కొనియాడారు. అందుకోసమే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అతితక్కువ కాలంలోనే ప్రవేశపెట్టారని కలెక్టర్ పేర్కొన్నారు. 
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు

వ్యవసాయానికి అవసరమైన సమాచారాన్ని అందజేయడంతో పాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సైతం అందించి రైతు ముంగిటకే వ్యవసాయ సేవలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రైతు దినోత్సవం రోజున దేశానికి అన్నం పెట్టె రైతున్నలను సత్కరించుకోవడం జరుగుతుందని చెప్పారు. 
    2019-20 సం.లో

వై.యస్.ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ క్రింద జిల్లాలో 46 లక్షల 69 వేల మంది కుటుంబాలకు రూ.6,534.07 కోట్లు పెట్టుబడి సాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. 2018-19 ఆర్ధిక సం.రంలోని వై.యస్.ఆర్ ఉచిత పంటల భీమా బకాయిల మొత్తాన్ని గత మాసంలో చెల్లించడం జరిగిందన్నారు. దీని ద్వారా 5.94 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరిందని చెప్పారు. 2019 ఖరీఫ్ లో

రైతుల ప్రీమియం రూ.689.25 కోట్లతో పాటు రాష్ట్ర వాటాగా రూ.766.09 కోట్లతో కలిపి మొత్తం రూ.1455.34 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. 2019-20 రబీలో ఒక్క పైసా ప్రీమియం చెల్లింపు లేకుండా బీమా చేసిన 23.17 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణం మొత్తాన్ని ఇ-క్రాప్ నమోదు ద్వారా 33.04 లక్షల మంది రైతులకు బీమా రక్షణ

కల్పించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 1,71,857 మంది రైతులకు 65,691 క్వింటాళ్ల వరి విత్తనాలను రూ.6.56 కోట్ల సబ్సిడీతో, అలాగే 1,688 క్వింటాళ్ల పెసర విత్తనాలను రూ.6.56 కోట్ల సబ్సిడీతో పంపిణీ చేసామని చెప్పారు. 67,874 మంది రైతులకు రూ.54.54 కోట్ల పెట్టుబడి రాయితీ నేరుగా రైతుల ఖాతాల్లోకి జమచేయడం జరిగిందన్నారు. ఉద్యానవన పంటల్లో

నష్టపోయిన 40,663 మంది రైతులకు రూ.37.54 కోట్ల పంట నష్టపరిహారాన్ని చెల్లించామని తెలిపారు.  2020 ఖరీఫ్ లో రూ.168.57 కోట్ల రాయితీతో 6.58 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను 12.22 లక్షల మంది రైతులకు పంపిణీచేసామని కలెక్టర్ రైతులకు వివరించారు.
    ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాబార్ట్ పాల్, సహాయ సంచాలకులు ఆర్.రవిప్రకాశ్,

ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam