DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా, ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 09, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం నాడు తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ అరెస్ట్ అయ్యారు. 

తెలంగాణ రాష్ట్రం నుండి గురువారం అక్రమ

మద్యం రవాణా కేసులో చింతలపూడి పోలీస్ స్టేషన్ నందు అరెస్టు కాబడిన ఎం. విజయ్ కుమార్ ఎస్సై నీ ఏలూరు రేంజ్ ఏలూరు కె వి మోహన్ రావు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. 

ఆంధ్ర ప్రదేశ్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఆక్ట్ రూల్స్ ను అనుసరించి ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడిన లేదా అధికార దుర్వినియోగం చేసిన ఎడల వారిపై

క్రమశిక్షణ చర్యలు తీసుకునే భాగంలో, ఆ ఎస్ఐ ఎం. విజయ్ కుమార్ పై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె. ఎన్. నారాయణ్ ప్రాథమిక విచారణ చేసి, నివేదికను డిఐజి కి పంపడం జరిగింది. డీఐజీ మోహన్ రావు ఎస్ఐ కి సస్పెన్షన్ ఉత్తర్వులను ఇవ్వడం జరిగినది. 

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్

చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా అక్రమ మద్యం తరలిస్తున్న పలువుర్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎక్సయిజ్ సీఐ పులి హనుశ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్.ఐ. విజయ కుమార్ (వీఆర్‌లో ఉన్నారు), ఏలూరుకు చెందిన నున్న కమల్, సంతోష్‌లు ఉన్నారు. నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 557 మద్యం సీసాలు

స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా.. మరో నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam