DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలకొల్లు లో 435 కేజీ ల గంజాయి పట్టివేత 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 10, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె ఎన్ నారాయణ్, జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పి కరీముల్లా షరీఫ్ ఆదేశాలపై

పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు, పాలకొల్లులో భారీ స్దాయిలో 435 కేజీ లు గంజాయి, డస్టర్ కారు ను స్వాధీనము చేసుకున్న రు. 

పాలకొల్లు పట్టణ పోలీసులు, గంజాయి నీ సరఫరాను చేస్తున్న మూలాలను కనుగొనీ ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసిన పాలకొల్లు పోలీసులను జిల్లా ఎస్పీ కె ఎన్ నారాయణ్, పశ్చిమగోదావరి జిల్లా

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్  అభినందించారు

పశ్చిమ గోదావరి జిల్లా లో భారీ స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్  వర్క్ ను చేపడుతున్న పోలీస్ లకు గురువారం రాత్రి నరసాపురం సబ్ డివిజన్ లో పాలకొల్లు టౌన్ శివారులోని స్వప్నబార్ దగ్గర పోలీస్ లు నిర్వహించారు. ఆకస్మిక వాహన తనిఖీలో విశాఖ

ఏజెన్సీ ప్రాంతం నుండి డస్టర్   కార్ లో తరలిస్తున్న సుమారు 435 కె.జి ల గంజాయిని ఉన్నించినా,   ఆ కార్ పోలీస్ లకు చిక్కకుండా బైక్ పై ఎస్కార్ట్ చేసుకుంటూ వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పోలీస్ లు పట్టుకోవడం జరిగింది ఈ రైడ్ లో 21,75,000/- విలువ కలిగిన గంజాయి, ఒక డస్టర్  కార్, రెండు బైక్ లు, రెండు సెల్ ఫోన్ లు, పోలీస్ లు స్వాధీనం

చేసుకుని ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అని నరసాపురం డి.ఎస్.పి నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ లో  వివరాలు వెల్లడించారు. ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయిని అమ్ముతున్న మిగిలిన ముద్దాయిల కోసం పోలీస్ లు గాలింపుచర్యలు చేపట్టారు. 
 ఈ రైడ్ లో పాల్గొన్న పాలకొల్లు టౌన్ సి.ఐ. సిహెచ్. ఆంజనేయులు గారు,

ఎస్ఐ అయిన ఎఫ్. రహమాన్, జె.వి. ఎన్ ప్రసాద్ గార్లు, మరియు వారి సిబ్బందిని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి . యస్. ఈ.బి  అదనపు ఎస్పీ గారు సిబ్బందిని అభినందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam