DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యూజీ, పీజీ పరీక్షలు వ్రాసే విద్యార్థులకు యూజీసీ సూచనలు. . .

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 10, 2020 (డిఎన్ఎస్):*

*అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) పరీక్షలు రాసే విద్యార్థులు హాజరుపత్రంలో సంతకం చేసే ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజ్‌ చేసుకునేలా చూడాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం

(యూజీసీ) సూచించింది..*

◆యూజీ, పీజీ చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు సెప్టెంబరు 30లోగా తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన యూజీసీ.. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది.

◆జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్న విద్యార్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని, లేదంటే వారు పరీక్ష

రాసేందుకు మరోసారి సమయమివ్వాలని సూచించింది.

◆ఒక్కో విద్యార్థి మధ్య కనీసం 2 మీటర్ల దూరం ఉండాలని, వారి ఆరోగ్య రికార్డులను ఇన్విజిలేటర్లు, పరీక్షల సిబ్బంది నిర్వహించాలని ఆదేశించింది.

◆విద్యార్థులు, సిబ్బందికి గుర్తింపు కార్డులు ఉండాలి..

*కట్టడి ప్రాంతం, రెడ్‌జోన్‌ నుంచి వచ్చే

విద్యార్థులు, సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలి. వీటిని పాస్‌ల కింద వినియోగించుకోవాలి..*

◆పరీక్షల నిర్వహణలో పాలుపంచుకునే సిబ్బంది ఆరోగ్యంపై స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి.

*భౌతిక దూరం పాటించేలా చూడాలి. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..*

◆ద్వారాల వద్ద గుమికూడకుండా

చర్యలు తీసుకోవాలి. సీనియర్‌ అధ్యాపకులు పర్యవేక్షించాలి.

◆పరీక్షలు నిర్వహించే భవనం మొత్తం నిత్యం శానిటైజ్‌ చేయాలి.

*ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఏ రోజుకారోజు కొత్త మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి.ప్రతి సెషన్‌కు విద్యార్థులు కూర్చునే సీటు, డెస్కులను శానిటైజ్‌ చేయాలి..*
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam