DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎందరో ఘనపాఠిలను అందించిన వేదస్వరూపునకు ఘన నివాళి

*బ్రహ్మశ్రీ వెంకటరామన్ ఘనాపాఠి చిరస్మరణీయులు* 

*వేదం మెచ్చిన ఘన పాఠి విద్య ఆచంద్ర తారార్కమే : స్వరూపానందేంద్ర*  

*రాష్ట్రపతి అవార్డు గ్రహీత శంకర వేదభవన్ వ్యవస్థాపకులు శివైక్యం*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 10, 2020 (డిఎన్ఎస్):* ఈ వేదభూమి పై

వేద స్వరం నలుదిశలా విస్తరించాలనే ఏకైక సంకల్పంతో వందలాది మందిని వేదవిద్యార్థులకు వేదవిద్యను అందించిన  వేదస్వరూపులు, వేద సరస్వతీ సమానులు, శ్రీ శంకర వేదభవన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెంకటరామన్ ఘనపాఠి కి ఘన నివాళి అర్పిస్తున్నారు. శుక్రవారం అయన శివైక్యం చెందడం పట్ల దేశం లోని  వివిధ పీఠాధిపతులు, వేద పాఠశాలల

నిర్వాహక, అధ్యాపక, విద్యార్థి గణం, భక్త శ్రేష్ఠులు, హైందవ సమాజం మొత్తం విస్మయానికి గురైంది.   

విశాఖ శారదాపీఠం అంటే ఆయనకు ఎంతో అనుబంధం ఉందని, విశాఖ శ్రీసరదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. తాము ఋషికేష్ లో చాతుర్మాస్య దీక్ష లో ఉండగా ఈ వార్త తెలియడం మరింత శోకతప్తమ్ అన్నారు. ఉభయ తెలుగు

రాష్ట్రాలలోనే కాదు యావత్తు దేశమంతా వారి యొక్క అంతేవాసులు (శిష్యులు) ఉన్నారని, ఎంతో మందిని వేదపండితులుగా తీర్చిదిద్దిన ఘనత వారిది అన్నారు. ద స్వరూపుడై నటువంటి  ఆ పరమాత్మ సాన్నిధ్యానికి పొందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

వెంకటరామన్ ఘనపాఠి భారత రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్న అతి కొద్దిమంది

వేదపండితుల్లో స్థానం దక్కించుకున్నారు. 
తిరుమల తిరుపతి దేవస్థానం ల ట్రస్ట్ బోర్డు సభ్యునిగా సైతం 2009 లో సేవలు అందించారు.  
టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో వేదపారాయణ పధకం, పరీక్షల ముఖ్య పర్యవేక్షకునిగాను, టిటిడి లో వేదసభల నిర్వహనుకునిగానూ సేవలందించారు.
టిటిడి లో ఆచార్యునిగానూ

సేవలందించారు. 

తాము నేర్చుకున్న వేదవిద్యను మరికొందరికి అందించాలని హైదారాబాద్ కేంద్రంగా 1984 లో తన నివాసం లోనే ముగ్గురు విద్యార్థులతో శ్రీ శంకర వేదపాఠశాలను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్న రీతిలో నేడు అదే కేంద్రం నుంచి వందలాది మంది విద్యార్థులు,  ఘనపాఠి లను తయారు చేసిన మహనీయులు. ప్రస్తుతం ఈ

కేంద్రంలో 125 మంది విద్యార్థులు వేదపఠనం చేస్తున్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, వేదభాష్యం తదితర వేదవాఙ్మయం విద్యార్థులకు అందించడం జరుగుతోంది.  ప్రధానంగా 37 మంది క్రమాంతం పూర్తి చేసుకున్నారు, 32 మంది విద్యార్థులు ఘనాంతం పూర్తి చేసుకున్నారు. 5 గురు సంహిత, స్మార్త కూడా పూర్తి చేసుకోవడం ఈ విద్యాలయం ఘనత.   
ఈ పాఠశాల

అందించిన విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో వేదపారాయణదారులుగాను, ఆలయాలు, వివిధ పీఠాల్లో వేద అధ్యాపకులుగాను, అత్యున్నత స్థానాల్లో వేద సేవ అందిస్తున్నారు. 

అతి తక్కువ సమయంలోనే ఇంతమంది వేదపండితులు తయారు చెయ్యడం అంత సులభమైన విషయం కాదు అనేది పీఠాధిపతులు అంగీకరించే విషయం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam