DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబర్ 3 నుంచి  ఆస్ట్రేలియా లో 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

విశాఖపట్నం, జులై 11 , 2018 (DNS Online ): ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నతెలుగు భాషా ప్రియులు ఆయా దేశాల్లో ప్రపంచ స్థాయిలో తెలుగు సాహితీ సదస్సులను

కూడా అద్వితీయంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నవంబర్ 3 , 2018 నుంచి రెండు రోజుల పాటు ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరం లో 6 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనే సాహితీ ప్రియుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రముఖ సాహితీవేత్త వంగూరి చిట్టెన్ రాజు తెలియచేసారు. ఈ సదస్సు

వివరాలను DNS News  à°•à± అందించారు.       

మూడు దేశాలలో తెలుగు భాషా సాహిత్యాల పురోగతికి  à°…హర్నిశలూ కృషి చేస్తున్న నాలుగు సాహిత్య సంస్థలు  à°¸à°‚యుక్తంగా ఆస్ట్రేలియా

లో మెల్బోర్న్ మహానగరంలో రాబోయే నవంబర్ 3-4, 2018 తారీకులలో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ 6à°µ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాష,

సాహిత్యాభిమానులందరినీ  à°¸à°¾à°¦à°°à°‚à°—à°¾ ఆహ్వానిస్తున్నారు.  

గత 26 సంవత్సరాలగా ఆస్ట్రేలియా ఖండంలో తెలుగు భాష, సంస్కృతి, సంగీత, నాట్య కళా రూపాలకి నిరుపమానమైన

సేవలందిస్తున్న “ఆస్టేలియా తెలుగు సంఘం” (Telugu Association of Australia, Inc.), మెల్బోర్న్, ఆస్ట్రేలియా,   ప్రపంచ వ్యాప్తంగా à°—à°¤ 24 సంవత్సరాలుగా శతాధిక సాహితీ సదస్సులూ, సాహిత్య కార్యక్రమాల

నిర్వహణ ద్వారా   అపార అనుభవం à°—à°² "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా",  à°¹à±à°¯à±‚స్టన్ (అమెరికా) & హైదరాబాద్ (భారత దేశం),  à°¤à±†à°²à±à°—ు నాట మన భాషా సాహిత్యాల పురోగతికి అలుపెరగని

కృషి చేస్తున్న సాహిత్య సంస్థ లోక్ నాయక్ ఫౌండేషన్, విశాఖపట్నం, భారత దేశం. వీటితో పాటు ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య, సింగపూర్, హాంగ్ కాంగ్, ఇండొనీషియా, మైన్మార్,

థాయ్ లాండ్, బాలి, మలేసియా మొదలైన దేశాల లో ఉన్న తెలుగు సంస్థలు  à°¤à°® సహకారం అందిస్తున్నారు.

2007 లో మొదలయిన ఈ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుల ప్రస్థానం ఇప్పటివరకూ

నాలుగు దేశాలలో (భారత దేశంలో హైదరాబాద్ , అమెరికాలో హ్యూస్టన్ మహా నగరం,  à°¯à±à°¨à±ˆà°Ÿà±†à°¡à± కింగ్డం లో లండన్ మహా నగరం, సింగపూర్)  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• తెలుగు సంఘాల సహకారంతో

దిగ్విజయంగా జరిగాయి. శ్రీయుతులు బాపు-రమణ, డా. సినారె, గొల్లపూడి, డా. యార్లగడ్డ , గౌ. మండలి బుద్ద ప్రసాద్, సిరివెన్నెల, జొన్నవిత్తుల, తనికెళ్ళ భరణి, అశోక్ తేజ, భువన

చంద్ర, అవధాన సరస్వతి పాలపర్తి, డి. కామేశ్వరి, అక్కిరాజు రమాపతి రావు, ద్వానా శాస్రి , నటుడు బ్రహ్మానందం, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ఆచార్య ముత్యాల నాయుడు, చందు

సుబ్బారావు, కె. మల్లీశ్వరి, ముక్తేవి భారతి,  à°•à±†. శ్రీనివాస్, హాస్య బ్రహ్మ శంకర నారాయణ, మీగడ రామలింగ స్వామి మొదలైన  à°¸à±à°ªà±à°°à°¸à°¿à°¦à±à°§ సాహితీవేత్తలు ముఖ్య అతిథులుగా

పాల్గొన్నారు. సెప్టెంబర్, 2014 లో సింగపూర్ లో జరిగిన 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు 12 దేశాలనుండి సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొని సభను దిగ్విజయం

చేశారు. 

ఆస్ట్రేలియా ఖండంలో ప్రపంచ స్థాయిలోనే కాక  à°œà°¾à°¤à±€à°¯ స్థాయిలో కూడా తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ సాహిత్య సదస్సు జరగడం చరిత్రలో ఇదే మొదటి

సారి.  

à°ˆ పోటీల్లో పాల్గొనదలచిన ఔత్సాహికులకు సూచనలు చేశారు. 

సదస్సు  à°ªà±à°°à°§à°¾à°¨à°¾à°‚శం : “తెలుగు సాహిత్యంలో హాస్యం -à°† నాడూ-à°ˆ నాడూ”

సదస్సు  à°ªà±à°°à°§à°¾à°¨

ఆశయాలు

1.    à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగానూ, ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు దక్షిణ ఆసియా à°–à°‚à°¡à°‚ లో ఉన్న దేశాలలో నివశిస్తున్న తెలుగు రచయితలూ, పండితులూ, సాహిత్యాభిమానులూ,

కలుసుకుని తమ  à°¤à±†à°²à±à°—ు సాహిత్యాభిమానాన్నీ, తమ రచనలనీ సహ భాషాభిమానులతో, ఆత్మీయ వాతావరణంలో పంచుకునే వేదిక ని కల్పించడం.

2.       తెలుగు సాహిత్యానికి ప్రపంచ

వ్యాప్తంగానే కాక తెలుగు నాట కూడా తగిన గుర్తింపుకి ఆచరణ సాధ్యమైన ప్రణాళికల పై చర్చించడం.

3.      à°¤à±†à°²à±à°—ు భాషకీ, సంస్కృతికీ అనుసంధానమైన తెలుగు సృజనాత్మక

సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ  à°†à°‚గ్ల భాషా ప్రభావంలో రెప రెపలాడుతున్న మన సాహిత్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం.

4.      à°¨à°¿à°·à±à°£à°¾à°¤à±à°²à±ˆà°¨ సాహిత్య కారుల

ఆహ్లాదకరమైన ప్రసంగాలు వినే అవకాశం కల్పించడం. 

సదస్సు పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేయనున్నట్టు తెలిపారు. ఇతర వివరాలకు  

సదస్సు సంచాలకులు

Sreeni

Katta (President, Telugu Association of Australia, Melbourne), Phone 61 413 398 940, E-mail: sreenik2004@yahoo.com.au

Dr. Vanguri Chitten Raju (Vanguri Foundation of America), Phone: (1) 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

ప్రధాన సమన్వయ కర్త: Rao Konchada,  Phone: 61 422 116 542, E-mail: rao.konchada@gmail.com

భారత దేశ సమన్వయ కర్త: Dr. Vamsee Ramaraju,  Phone: (91) 98490 23852, E-mail: ramarajuvamsee@yahoo.co.in

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam