DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ రూల్స్ పక్కాగా అమలు: ఎస్పీ అమిత్ బార్డర్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 11, 2020 (డిఎన్ఎస్):*

శ్రీకాకుళం, జూలై 11 : జిల్లాలో కరోనా నియంత్రణ లో భాగంగా  లాక్ డౌన్ నియమా నిబంధనలు పక్కాగా అమలుజరగాలని జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్డర్  పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్నంలో హడ్డుకో కొలని,బావాజీ తోట,రైతు బజార్ మరియు

పాండురంగ వీధి లో గల కంటైన్మెంటు జోన్ లలో ఏర్పాట్లను  శనివారం జిల్లా ఎస్పీ పరిశీలించారు.కంటైన్మెంటు జోన్ లలో దుకాణాలు తెరవరాదని ఆయన ఆదేశించారు అనవసరంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకూడదుని, శ్రీకాకుళం పట్నంలో లాక్ డౌన్ అమల్లో ఉనందునా ప్రజలు  రాకపోకలు ఉండరాదని పేర్కొన్నారు. కంటైన్మెంటు జోన్లలో ప్రజలు సూచనలను

పక్కాగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. నిత్యావసరాల సరుకులు, తాగు నీరు, అందేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. కంటైన్మెంటు జోన్లలో ప్రతి ఒక్కరి నమూనా సేకరించి పరీక్షంచాలని పాజిటివ్ వ్యక్తుల కాంటాక్టులను గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలని, కాంటాక్టులను గుర్తించడంలో ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా సామాజిక

వ్యాప్తి అతి త్వరగా జరిగే అవకాశం ఉంటుందని కావునా పాజిటివ్ వ్యక్తుల ప్రయమిరి సెకండరీ కాంటాక్టులను గుర్తించి క్వారంటాయిన్ చేయాలని . ఇతర ప్రాంతాల నుండి వస్తున్న వారి వివరాలు సైతం అందించాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లాలో అన్ని చర్యలు చేపట్టామని ఎస్పీ అన్నారు. ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించి

వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగస్వామ్యం కావాలన్నారు. 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు, వివిధ వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, చేతులు సబ్బుతో గాని, శానిటైజర్ తో గాని శుభ్రపర్చుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.  ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించాలని

సూచించారు. అనవసరంగా బయట తిరగరాదని అత్యవసరం అయితేనే రావాలని సూచించారు. జిల్లాలో కరోనా వైరస్ రోజూ రోజుకు  వ్యాప్తి జరుగుతోందని ప్రజలు గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 2వ పట్నం సి. ఐ. మరియు ఎస్ ఐలు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam