DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ నివారణ చర్యలపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 11, 2020 (డిఎన్ఎస్):* కోవిడ్ 19 నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఏలూరు కలెక్టరేట్ లో డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలు రాజు, జిల్లా ఎస్పీ కె ఎన్ నారాయణ్, జిల్లా వైద్య ఆరోగ్య

శాఖ, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏలూరు ఆశ్రమ్, తాడేపల్లిగూడెం, భీమవరం లలో కోవిడ్ పేషేంట్లతో మాట్లాడారు. కోవిడ్ ఆసుపత్రులలో భోజనం నాణ్యత లేదని బాధితులు ఫిర్యాదు చేసారు. దుప్పట్లు ఇవ్వడంలేదని, బాత్ రూమ్ లు పరిశుభ్రము చేయడం లేదని తెలిపారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి ఆదేశించారు.

ఎలాంటి సమస్య ఉన్నా 18002331077 కు, లేదా నా నెంబర్ కు నేరుగా ఫిర్యాదు చేయాలని భరోసా ఇచ్చారు. రోజు కు రూ.500 లు వెచ్చించి ప్రతీ పాజిటివ్ వ్యక్తికి పౌష్టికాహారం అందించేలా సీఎం జగన్ అదేశించారని తెలిపారు. కోవిడ్, క్వారంటైన్ సెంటర్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
సోమవారం నుండి ఏలూరులోని 71 హాట్

స్పాట్ లలో కఠిన ఆoక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం జిల్లాకు 4 ట్రూనట్ టెస్ట్ మిషన్లు, ఒక ఐవిఆరెస్ మిషన్ వస్తుందన్నారు. జిల్లాలో కోవిడ్ అనుమానితులకు వేగంగా టెస్ట్ లు చేసి, రిజల్ట్ వచ్చే వరకూ ప్రత్యేక ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశం జారీ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam