DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రక్షాళన దిశగా  సిఎంవో కార్యాలయం, తెరపైకి ఐఎఎస్‍లు?

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 11, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తి ప్రక్షాళన దిశగా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా యువ ఐఏఎస్ అధికారులతో నిండిపోనుంది. ఇప్పడికే ముఖ్యమంత్రి కార్యాలయంలో సలహాదారుగా పనిచేస్తున్న అజయ్‍ కల్లం.. అదనపు ప్రభుత్వ ప్రధాన

కార్యదర్శిగా నియమితులైన పివి.రమేష్‍లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పించారు. నవరత్నాలను పూర్తిగా అమలు చెయ్యాలి అనే సంకల్పనతో సీఎం తీసుకునే నిర్ణయాల అంచనాల మేరకు ఫైళ్లు కదలడం లేదు అనే భావనతోనే భారీ కదలిక ఆరంభమైనట్టు సమాచారం. 
ఐఏఎస్‍ అధికారి నాగులపల్లి శ్రీకాంత్‍, విజయ్‍కుమార్‍, కోన శశిధర్‍

మరియు శశిభూషణ కుమార్‍లలో ఇద్దరిని సిఎంవోలోకి తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.

సిఎంగా జగన్‍ ప్రమాణ స్వీకారం చేశాక.. శశిధర్‍ను సిఎంవోలోకి తీసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ అప్పట్లో అది అమలు కాలేదు.

అదే విధంగా ఐఎఎస్‍ అధికారి విజయ్‍ కమార్‍ అంటే సిఎంకు వల్లమాలిన

అభిమానం.

నాగులపల్లి శ్రీకాంత్‍ పేరును కూడా పున:ప్రాతిపదిక మీద పరిశీలించే అవకాశాలున్నాయి. 

ఒకవేళ సిఎంవోలోకి మరో తెలుగేతర ఐఎఎస్‍ అధికారిని తీసుకోవాలని సిఎం భావిస్తే.. శశిభూషణ్‍ కుమార్‍ను పరిశీలించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.. ఈ నలుగురిలో కోన శశిధర్‍, నాగులపల్లి శ్రీకాంత్‍

పేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి.

సిఎం జగన్‍ ఆ ఇద్దరిని తీసుకుంటారా.. మరో ఇద్దరిలో ఎవరినైనా తీసుకుంటారా.. అనే విషయం బయట పడటం లేదు. 

ఈ నలుగురు ఐఎఎస్‍ అధికారుల పేర్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసహానికి ఈ విషయం తెలియదట. అదే విధంగా సిఎం కార్యాలయ

ఇంఛార్జి ప్రవీణ్‍ ప్రకాష్‍ కూడా ఈ విషయంపై బయట పడకుండా మౌనం వహిస్తున్నారు. మరో సీనియర్‍ అధికారిని సిఎంవోలోకి తీసుకోవాలని జగన్‍ భావిస్తున్నప్పటికీ… ఆ అధికారికి అడ్డంకి ఏర్పడింది. 

ప్రస్తుతం సిఎంవోలో పనిచేస్తున్న ప్రవీణ్‍ ప్రకాష్‍, సల్మాన్‍ ఆరోగ్యరాజ్‍, ధనుంజయరెడ్డిలతోనే సరిపెడతారా.. మరో

ఇద్దరు, ముగ్గురుని సిఎంవోలోకి జగన్‍ తీసుకుంటారా అనే విషయం రెండు, మూడు రోజులలో తేలడం ఖాయం.

పైన పేర్కొన్న నలుగురు ఐఎఎస్‍ అధికారులలో కోన శశిధర్‍ నియామకానికి జగన్‍ గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చినట్లే అని అంటున్నారు.
 
ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న అజయ్‍ కల్లం, పివి.రమేష్‍, మురళీలు

పర్యవేక్షిస్తున్న శాఖలన్నింటినీ ప్రవీణ్‍ ప్రకాష్‍, సల్మాన్‍ ఆరోగ్యరాజ్‍, ధనుంజయరెడ్డిలకు కేటాయిస్తూ ప్రవీణ్‍ ప్రకాష్‍ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. అప్పగించిన బాధ్యతలు తాత్కాలికమే అని.. మరో ఇద్దరు ముగ్గురు ఐఎఎస్‍ అధికారులను జగన్‍ తీసుకుంటారని.. కానీ ఆయన మనసులో ఉన్న విషయం బయట పడటంలేదని.. ఈ విషయం

ప్రవీణ్‍ ప్రకాష్‍, సల్మాన్‍ రాజ్‍, ధనుంజయరెడ్డిలకు కూడా తెలియదని ప్రచారం జరుగుతోంది. ఏ
ది ఏమైనప్పటికీ.. సిఎంవోలో ఇటీవల మార్పులు జరిగిన నేపధ్యంలో మరో ఇద్దరు ఐఎఎస్‍ అధికారులను సిఎంవోలోకి తీసుకోవటం ఖాయమని స్పష్టమవుతోందంటున్నారు అధికారులు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam