DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమలాపురం డివిజన్ లో 14 నుంచి కొత్త నిబంధనలు: ఆర్డిఓ

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 13, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ లో కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న దృష్ట్యా రేపటి నుండి డివిజన్ అంతటా అన్ని షాపులు, మార్కెట్లు, వీధి వ్యాపారులు,షాపింగ్ మాల్స్,లిక్కర్ షాపులుకు కూడా ఉదయం 6.00 గంటల నుండి 11.00 గంటల వరకు మాత్రమే అనుమతి

ఇవ్వడం జరిగిందని అమలాపురం రెవిన్యూ డివిజన్ అధికారి బి. హెచ్. భవానీ శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. 

1.అన్ని షాపుల లోను మాస్క్ లు తప్పనిసరిగా ధరించే అమ్మకాలు జరగాలని ఆర్.డి. ఓ హెచ్చరించారు. 

 2.పాలు,పాల ఉత్పత్తులుకు సంబంధించిన డైరీ ఫారాలు కూడా ఉదయం 6.00 గంటల నుండి 11.00 గంటల వరకు మాత్రమే

విక్రయించాలని ఆర్.డి. ఓ ఆదేశించారు.

 3.కేవలం అత్యవసర వైద్య సేవలు అందించే మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రం 24 గంటలు పనిచేస్తాయని ఆయన తెలిపారు.

 4.చేపలు, మాంసం విక్రయించే మార్కెట్లు ఆదివారం మూసివేయడం జరుగుతుందని ఆర్.డి. ఓ పేర్కొన్నారు.

5. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్

కార్యాలయాలు,బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్(ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ లు వంటివి) రోజూ మాదిరిగానే పని చేస్తాయని అయితే తక్కువ సిబ్బంది తో అన్ని ముందు జాగ్రత్తలు అనగా మాస్క్ లు ధరించడం,సామాజిక దూరం పాటిస్తూ పనిచేయాలని  ఆర్.డి. ఓ తెలిపారు.

6. వివాహ సంబంధమైన కార్యక్రమాలకు పది మంది వరకు మాత్రమే

అనుమతి ఇవ్వడం జరుగుతుందని, వీటికి అవసరమైన అనుమతులు ఆర్.డి. ఓ, లేదా సంభందిత మండల తహశీల్దార్ నుండి పొందాలని ఆర్.డి. ఓ తెలియ చేశారు. పది మంది దాటి ఫంక్షన్ కు ఎక్కువ మంది హాజరైతే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

7.అమలాపురం డివిజన్ లో మార్చ్ 22 వ తేదీ నుండి జూలై 13 వ తేదీ ఈ రోజు వరకు నమోదైన

మొత్తం  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 352 కాగా రెండు కరోనా మరణాలు సంభవించాయిని ప్రస్తుతం డివిజన్ లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా వుందని ఇప్పటికైనా ప్రజలు కరోనా ప్రమాద స్థితిని గుర్తించి జాగర్త పడవలసిందిగా ఆర్.డి. ఓ విజ్ఞప్తి చేశారు.

8.మన ప్రక్కన సంచరించే వ్యకులకే కరోనా పాజిటివ్ గా గుర్తిస్తున్నామని, దీనిని

బట్టి మన ప్రక్క ఇళ్ల కు కూడా వెళ్ళే సాహసం చేయవద్దని ఆర్.డి. ఓ సూచించారు. అత్యవసర పరిస్థితిలో బయటకు వస్తే చుట్టూ ప్రక్కల కరోనా పాజిటివ్ కేసులు వున్నాయని గుర్తించి స్వీయ రక్షణా పద్దతులు పాటించాలని ఆర్.డి. ఓ సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam