DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం జగన్ చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి: టిడిపి ఎమ్మెల్సీ అశోక్

*టిడిపి ఎమ్మెల్సీ ల అనర్హతపై మండలి చైర్మన్ వద్ద విచారణ* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 14, 2020 (డిఎన్ఎస్):* ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటమీద నిలబడే వ్యక్తి అని మొత్తం వాళ్ళ పార్టీ సభ్యులంతా ప్రచారం చేస్తుంటారు కదా, శాసన సభలో ఇచ్చిన మాటకు ఆయన్ని కట్టుబడి ఉండమని

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సి అశోక్ బాబు కోరారు. 
ఇటీవల తెలుగుదేశం పార్టీ కి చెందిన శాసన మండలి సభ్యులు పోతుల సునీత, శివనాథ రెడ్డి లు పార్టీ మారడం పట్ల దాఖలైన అనర్హత పిటిషన్ లపై మండలి ఛైర్మన్ వద్ద మంగళవారం విచారణ జరుగుతోంది. ఈ విచారణకు టీడీపీ తరపున ఈ ఫిర్యాదు దాఖలు చేసిన ఎమ్మెల్సీ లు బుద్దా వెంకన్న, అశోక్ బాబు లు

హాజరయ్యారు. 
ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ తమ పార్టీ లోకి ఎవ్వరు వచ్చినా తమ శాసన సభ్యతం/ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే రావాలని సాక్షాత్తు ఆయనే శాసన సభలో చెప్పారన్నారు. ఇప్పుడు ఆయన్ని అదే మాట మీద నిలబడమని అడుగుతున్నామన్నారు. టిడిపి ఎమ్మెల్సీ లను రాజీనామా చేయించి, ఆ తర్వాతే పార్టీ లోకి

ఆహ్వానించాలన్నారు. 
ఈ ఆరవ వాయిదాకి కూడా ఆరోగ్య కారణాలు చూపుతూ దోషులు ఇద్దరూ హజరుకాలేదని బుద్ధా వెంకన్న తెలిపారు. వారు ఈ విచారణకు వస్తే పార్టీ మారినట్టు ఒప్పుకోవాల్సి వస్తుందని, అందుకే కుంటి సాకులతో బయపడి రావడం లేదని మండిపడ్డారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నచ్చి వెళితే ఆవిషయం ఛైర్మన్ కు వచ్చి

చెప్పాల్సిందన్నారు. ప్రతి వాయిదాకు వారి లాయర్లును పంపడం వారు హజరు కాకపోవడం కరెక్టు కాదని తెలిపారు. వచ్చే వాయిదాలో పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నామన్నారు.

టీడీపీ ఎమ్మెల్సి అశోక్ బాబు మాట్లాడుతూ మేమిద్దరం తెలుగు దేశం పార్టీ తరపున విచారణకు హరాజయ్యమని, మా అడ్వకేట్ లు క్వారంటైన్ లో ఉండడంతో

రాలేకపోయారని తెలిపారు. సుప్రీంకోర్టు  చెప్పినట్టు,  పార్లమెంటులో ఉన్న పద్దతిలో డిస్ క్వాలిఫికేషన్ ను 3 నెలల్లో ఫైనలైజ్  చేయాలని కోరామన్నారు. ప్రతి సారి వారి సాకులు పరిగణలోనికి తీసుకుంటే రెండు సంవత్సరాలు అయినా ఈ పిటిషన్ పై నిర్ణయం రాదని తెలిపారు. వచ్చే వాయిదాలో అయినా వారిని డిస్ క్వాలిఫై చేస్తూ నిర్ణయం

తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. 

మేము ఛైర్మన్ ని వచ్చే వాయిదాలో అయినా మెరిట్స్ ఆధారంగా చర్యలు తసుకోవాలని కోరామని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam