DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల ఆలయ గోశాల భూములు గురు సమర్పణకు సిద్దమయ్యాయా?

*కోట్ల విలువ చేసే భూములు 90 ఏళ్ళ పాటు గురుదక్షిణ కానున్నాయా?*

*నెలకి రూ. 6 లక్షలు ఖర్చు తగ్గించేందుకే ఉద్యోగులు ఇంటికి. .* 

*గోవులు, కోడెలు తరలిపోయేది ఖాళీ చేయించేందుకేనా ? . . .*

*పాలు పితికే వాళ్ళు లేక ఆవులు పొదుగులు పెరిగిపోయి విలవిలా* 

*ఇప్పడికే కొన్ని ఆవులు జిల్లా అధికారుల

ఇళ్లల్లో సేదతీరుతున్నాయి.* 

*జిల్లా కోర్టులో కేసు దాఖలు కు సుప్రీం కోర్టు లాయరా ?. . .*

*సింహగిరి  చైర్ పర్సన్ సంచయిత వైఖరి పై సర్వత్రా విమర్శలు*

*బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డా. కెవివి సత్యనారాయణ .* 

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,

జూలై 14, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల వాసుల ఆరాధ్యదైవమైన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానానికి చెందిన గోశాల ( అడవివరం మార్గంలో ) కోట్లాది రూపాయల విలువ చేసే వందల ఎకరాల భూములు గురుదక్షిణ కు సమర్పణం 
కానున్నాయా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ కెవివివి సత్యనారాయణ అనుమానం వ్యక్తం

చేస్తున్నారు. సింహాచల దేవస్థాన ట్రస్టీ చైర్ పర్సన్ సంచయిత తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాటిల్లో ప్రధాన అంశం సింహాచల దేవస్థాన గోశాల భూములను ప్రయివేట్ వ్యక్తులకు 90 ఏళ్ళ పాటు లాంగ్ లీజుకు ఇవ్వడమేనని, అయితే వీళ్లంతా ఒక ప్రముఖ ప్రజాప్రతినిధికి బినామీలేనని అనుమానాలూ

వ్యక్తమవుతున్నాయి. 

పాలు పితికే వారు లేక. . పొదుగులు పెరిగి . . . .
 
ప్రస్తుతం వివాదం గా మారిన అంశం 31 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తూ చైర్ పర్సన్ సంచాయితా గజపతి తీసుకున్న నిర్ణయం. గోశాల లో ఎంతో శ్రద్దగా ఆవులు, కోడెల ఆలనా పాలన చూసే వీరిని అర్దాంతరంగా తొలగించడం తో రెండు రోజుల నుంచి వీటి పాలు పితికే

వారు లేక వందల గోవులు పొదుగులు పెరిగి పోయి నానా అవస్థలు పడుతున్నాయి. ఇవి చూసే వారికి హృదవిదారకంగా మారింది. దీంతో కొండపై పారిశుధ్య కార్మికులను గోశాలకు పంపారు ఆలయ ఈఓ భ్రమరాంబ. అయితే వీరికి ఆవుల ఆలనా పాలనా తెలియక పోవడం తో ఈ పని మాకు చేతకాదని వెనక్కి వెళ్లిపోయారు. దాంతో కొండపైన నివాసం ఉండే గిరిజన కుటుంబాల వారిని గోశాలకు

పంపారు, వారికి ఏమి చెయ్యాలో తెలియక నిస్తేజంగా ఉండిపోయారు. గత రెండు రోజులుగా గోశాలలో పని చేసేవారు లేక ఆవులు అల్లాడిపోతున్నాయి. 

90 ఏళ్ళ లీజు కోసమే. . గోవుల తరలింపు . .. 

కోట్లాది రూపాయల విలువ చేసే వందల ఎకరాల భూములను ఐదుగురు బినామీల పేరుతొ ఒక ప్రజా ప్రతినిధికి గురుదక్షిణగా సమర్పించుకునే ప్రయత్నం లో

ఈ గోశాలను మొత్తం ఖాళీ చేస్తున్నారని సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందరో భక్తులు వరాహ నృసింహునికి ఇచ్చిన గోవులతో పాటు, కొందరు దాతల నుంచి లక్షల రూపాయలు విరాళంగా పొంది గుజరాత్ నుంచి తీసుకు వచ్చిన జర్సీ, ఇతర మేలు జాతి ఆవులను సైతం గోశాల నుంచి బయటకు పంపేందుకు రంగం సిద్దమైపోయిందన్నారు. 

ముందుగా

గోవులను బయటకు పంపితే గానీ భూములను ధారాదత్తం చెయ్యడానికి లేనందున, ప్రస్తుతం ఉన్న 120 గోవులను విడతలుగా బయటకు తరలించేస్తున్నారని తెలిపారు. వాటిల్లో భాగంగానే బుధ, గురువారాల్లో  సుమారు 30 నుంచి 50 గోవులను పాలు గ్రామాల సర్పంచులకు పంచేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. మరో రెండు వారాల్లో మిగిలిన గోవులు, కోడెలను కూడా బయటకు

పంపేందుకు ముందస్తు ప్రణాళిక సిద్దమైపోయిందన్నారు. 
గోవులు లేవు అని చూపించి, ఈ భూములను అభివృద్ధి పరిచేందుకు సాకుగా చూపించి గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నానికి రంగం సిద్ధమైపోయింది మండిపడుతున్నారు. 

జిల్లా కోర్టులో కేసు దాఖలు కు సుప్రీం కోర్టు లాయరా?. . .  

ప్రస్తుతం సింహాచల దేవస్థాన

న్యాయ సమస్యలను చూసేందుకు నగర పరిధిలో ఉన్న ప్రముఖ న్యాయవాదిని కూడా తొలగించి, సుప్రీం కోర్టు కు చెందిన తనకు అనుకూలంగా ఉన్న ఒక న్యాయవాదిని లీగల్ అడ్వైజర్ గా నియమించేందుకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు సమాచారం ఉందన్నారు. దీనిపై ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతానికి ఆపడం

జరిగిందన్నారు. 

స్వామి పరిపూర్ణానందకు ఫిర్యాదు:. .. 

సింహాచల దేవస్థానం లోని గోశాల ను ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే విషయాన్నీ కాకినాడ శ్రీపీఠాధిపతులు  స్వామి పరిపూర్ణానంద దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందనిసత్యనారాయణ తెలిపారు. 

ఖర్చు నెలకి రూ. 6 లక్షలు ట. . అందుకే.

గోశాల నిర్వహణకు ప్రత్తి నెల రూ. 6 లక్షలు ఖర్చు అవుతోందని, దీంతో నిర్వహణ భారం అధికంగా ఉన్నందున తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం జరిగిందని ఆలయ ట్రస్టీ చైర్ పర్సన్, ఈఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందన్నారు. గోవుల నిర్వహణ కోసం భక్తుల నుంచి తీసుకున్న లక్షలాది రూపాయల విరాళాలను ఏమి చేసారని ప్రశ్నించారు.

 ఉద్యోగులను తొలగిస్తే సగం ఖర్చులు తగ్గుతాయని, గోవులను బయటకు తరలిస్తే పూర్తి ఖర్చులు తగ్గుతాయని ఆలయ నిర్వాహకుల యోచనగా ఉందన్నారు. పైగా గోవులు లేక, ఉద్యోగులు లేక గోశాల మొత్తం ఖాళీ ఉంటుంది కనుక, ఆ సాకు చూపిస్తే. . .వందలాది ఎకరాల భూములను ప్రకప్రతినిధి గురుదక్షిణ రూపంలో సమర్పించవచ్చని ఆలోచనతో వీళ్ళు ఉన్నట్టు అనుమానాలు

ఉన్నాయని సత్యనారాయణ తెలియచేస్తున్నారు. 

ఇప్పడికే కొన్ని అధికారుల ఇంట సేద తీరుతున్నాయి. .

సింహాచలం గోశాల లో జరుగుతున్నా కుతంత్రాలు తెలిసిన కొందరు అధికారులు, గోమాతలను కనీసం కొన్నింటినైనా రక్షించాలి అనే సంకల్పంతో కొన్నింటిని తమ సంరక్షణలో సేవచేసుకునేందుకు తీసుకు వెళ్లడం జరిగింది. వీరిలో

అధికారులు, నగర ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నిత్యం ఆరాధనలు చేస్తూ వాటిని సంరక్షిస్తున్నట్టుగా సమాచారం.  

ట్రస్ట్ బోర్డు సమావేశం వాయిదా ఎందుకు ?

గోశాల భూముల వ్యవహారం పై అనుమానం వచ్చిన ఆలయ ట్రస్టీలు తక్షణం బోర్డు సమావేశం నిర్వహించాలని ఈఓ ను కోరారు. అయితే చైర్మన్ సూచన మేరకు, ప్రస్తుతం

కరోనా ప్రభావం ఉన్నందున, బోర్డు సమావేశాన్ని ఒక వారం వాయిదా వేస్తున్నట్టు ఈఓ ప్రకటించడం గమనార్హం. 

ఏది ఏమైనా. . సింహాచల దేవస్థానం కు చెందిన కోట్లాది రూపాయల విలువల చేసే భూములను పెద్దలకు ధారాదత్తం చేసేందుకు సింహాచలం చైర్మన్ సిద్దమయ్యారన్నది తెలుస్తోందని సత్యనారాయణ మండిపడుతున్నారు. చైర్మన్ కేవలం అనువంశిక

ధర్మకర్త మాత్రమేనని, దేవస్థానం పై పెత్తనం చేసేందుకు మాత్రం ఆమెకు అధికారం లేదని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam