DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగష్టు 1వ తేదీ నుండి ఆర్.టి.సి డ్రైవింగు స్కూల్ శిక్షణ

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 15, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా శాఖ హెవీ వెహికల్ డ్రైవింగు స్కూల్ ద్వారా శిక్షణ కల్పించుటకు సిద్ధం చేసామని డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆగష్టు 1వ తేదీ

నుండి మొదటి బ్యాచ్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. 20 మంది అభ్యర్ధులతో బ్యాచ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. హెవీ వెహికల్ డ్రైవింగులో ఆసక్తిగల అభ్యర్ధులు శ్రీకాకుళం డిపో -1 కార్యాలయంలో హెవీ వెహికల్ డ్రైవింగుకు దరఖాస్తు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. 40 రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఇందులో 16 రోజులు బోధనా తరగతులు ఉంటాయని

ఆమె చెప్పారు. 16 రోజులు బస్సుపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తామని వరలక్ష్మి చెప్పారు. 40 రోజుల శిక్షణా కాలంలో విధిగా 32 రోజుల హాజరు ఉండాలని ఆమె స్పష్టం చేసారు. శిక్షణ కాలం పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు డ్రైవింగు సర్టిఫికేట్ జారీ చేస్తామని తెలిపారు. హెవీ డ్రైవింగు శిక్షణకు అభ్యర్ధులకు 20 సంవత్సరాలు నిండి తగిన శరీర ధారుడ్యం

కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు. కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, లైట్ మోటార్ వెహికల్ (ఎల్.ఎం.వి) లైసెన్సు పొంది సంవత్సర కాలం పూర్తి చేసుకుని, హెవీ వెహికల్ ఎల్.ఎల్.ఆర్ డ్రైవింగు లైసెన్సు కలిగి ఉన్న అభ్యర్ధులు అర్హులన్నారు. శిక్షణ ఫీజు జి.ఎస్.టితో సహా రూ.15 వేలుగా నిర్ణయించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని

నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వివరములకు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ – 995925605, డిపో మేనేజర్, శ్రీకాకుళం-1 - 9959225608, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) 7382921647 నంబర్లకు సంప్రదించ వచ్చని ఆమె సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam