DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వి.ఆర్.డి.లాబ్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 15, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం వైరస్ రిసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లేబరేటరీ (వి.ఆర్.డి.ఎల్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్) ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉద్యోగాలను 6 నెలల కాలానికి నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు ఈ నెల 17వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆసక్తి, అర్హత కలిగి అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో 17వ తేదీ ఉదయం 10 గంటల నుండి హాజరు కావచ్చని ఆమె వివరించారు. ఉద్యోగాలలో భాగంగా రిసెర్చ్ సైంటిస్టు (మెడికల్) ఒక పోస్టు, రిసెర్చ్

సైంటిస్టు (నాన్ మెడికల్) రెండు పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు. రిసెర్చ్ సైంటిస్టు (మెడికల్) పోస్టుకు యం.డి మైక్రోబయాలజి లేదా ఎం.డి.ఎస్, యం.వి.యస్.సి కలిగి ఉండి మాలిక్యులర్ బయాలజీలో అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ పోస్టుకు రూ.65 వేలు వేతనంగా నిర్ణయించడం జరిగిందని ఆమె చెప్పారు. రిసెర్చ్ సైంటిస్టు (నాన్

మెడికల్) పోస్టుకు బి.ఇ లేదా బి.టెక్ బయోటెక్నాలజి లేదా యం.ఎస్సీ (బయోటెక్నాలజీ) లేదా (మైక్రోబయాలజి)తో సహా పి.హెచ్.డి కలిగి ఉండాలని, మాలిక్యులర్ బయాలజీలో అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ పోస్టుకు రూ.60 వేలు వేతనంగా నిర్ణయించామని అన్నారు. 6 రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఈ పోస్టుకు యం.ఎస్సీ

(బయోటెక్నాలజీ) లేదా (మైక్రోబయాలజి)తో సహా మాలిక్యులర్ బయాలజీలో అనుభవం కలిగి ఉండాలని ఆమె చెప్పారు. రిసెర్చ్ అసిస్టెంటుకు నెలసరి వేతనం రూ.30 వేలుగా ఉంటుందని చెప్పారు. 20 లాబ్ టెక్నీషియన్ల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఈ పోస్టుకు బి.ఎస్సీతో సహా యం.ఎల్.టి కలిగి ఉండాలని అన్నారు. లాబ్ టెక్నీషియన్లకు నెలసరి వేతనం రూ.25 వేలుగా

ఉంటుందని చెప్పారు. 4 లాబ్ అసిస్టెంటు పోస్టులను డి.యం.ఎల్.టి అభ్యర్ధులతో భర్తీ చేయుట జరుగుతుందని అన్నారు. ల్యాబ్ అసిస్టెంటుకు రూ.12 వేలుగా వేతనం నిర్ణయించామని పేర్కొన్నారు. 20 డేటా ఎంట్రీ ఆపరేటర్లను బి.యస్.సి, బి.కాం కంప్యూటర్స్ లేదా డిగ్రీతో సహా కంప్యూటర్స్ లో అనుభవం ఉన్న అభ్యర్ధులతో భర్తీ చేయనున్నామని అన్నారు. డేటా

ఎంట్రీ ఆపరేటర్లకు రూ.12 వేలుగా వేతనం నిర్ణయించడం జరిగిందని ఆమె చెప్పారు. ఈ రంగంలో గల అభ్యర్ధుల అనుభవానికి ఇది మంచి అవకాశమని, అర్హులైన యువత ముందుకు రావాలని ఆమె కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam