DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మనోధైర్యాన్ని మించిన మందు లేదు: డిజిపి గౌతం సవాంగ్

*వైరస్ ను జయించి విధుల్లోకి వచ్చిన ఐపీఎస్ లకు స్వాగతం* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 17, 2020 (డిఎన్ఎస్):* గత కొన్ని నెలలుగా కోవిడ్-19 వ్యాప్తి నుండి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శక్తి వంచన లేకుండా  విధులు నిర్వహిస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా  కొంత మంది పోలీస్

సిబ్బంది  కరోనా వైరస్ (COVID 19) భారీన పడి, చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధులో చేరడం ఎంతో అభినందనీయం అన్నారు. తాజాగా కొవిడ్ మాహమ్మరి పై యుద్ధంలో విజయం సాధించిన దిశ స్పెషల్ ఆఫీసర్, బేటాలియన్ ఎస్‌పి దీపికా పాటిల్, డి‌సి‌పి  విక్రాంత్ పాటిల్ దంపతులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ స్వాగతం

పలికారు.

 ఈ సందర్బంగా డి‌జి‌పి మాట్లాడుతూ పోలీసు శాఖ లో విధులు నిర్వర్తిస్తూ కరోనా వైరస్ బారిన పడి సరైన సమయంలో గుర్తించి వైద్య చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా సిబ్బంది తిరిగి రావడం ఎంతో  సంతోషంగా ఉందన్నారు.  వైరస్ ను జయించిన పోలీస్ సిబ్బంది ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని , కోవిడ్ బాధితులలో

 మానసిక స్థైర్యం నింపాలని సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam