DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 నుంచి శ్రావణ మాసం, కొత్త రూల్ తో పెళ్లిళ్లులకు పెద్ద చిక్కే. . .

*20 మందే ఉండాలి, తహసీల్దార్ల అనుమతి  తప్పనిసరి.* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 17, 2020 (డిఎన్ఎస్):* ఈ నెల 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఆరంభం కానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం 20 మంది సభ్యులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందని

కొత్త నిబంధనలు విధించారు. వీటికి కూడా స్థానిక తహసీల్దార్ అనుమతి తప్పని సరి. ఈ కొత్త నిబంధనలతో ఎవరిని పిలవకుండా ఊరుకోవాలో తెలియక నిర్వాహకులు సతమతం అవుతున్నారు. పిలవకపోతే ఏమనుకుంటారో అనే ఫీలింగ్‌. ఇదిలా ఉంటే మరోకోణంలో పెళ్లికి పిలుస్తారేమోనని అటువైపు భయపడుతున్నారు. పిలవకుండా ఉంటే బాగుణ్ణు అని కూడా

అనుకుంటున్నారు. కాగా ఇప్పటివరకూ కార్యక్రమాలకు అనుమతి జిల్లా కలెక్టరేట్‌ నుంచి పొందాల్సి వచ్చేది. దీనివల్ల జాప్యం అవుతోంది. దీంతో మండల పరిధిలో తహసీల్దార్లకే బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 21వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో పెద్ద సంఖ్యలో వివాహాలు నిర్వహించుకోవడానికి బంధువులు

ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌కింది స్థాయిలోనే పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తామని ప్రొద్దుటూరు తహసీల్దారు జె.మనోహర్‌రెడ్డి తెలిపారు. మిగతా శుభకార్యాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

*

కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం కేవలం 20 మందికి మాత్రమే తహసీల్దార్‌ అనుమతి ఇస్తారు.

* పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడికి సంబంధించి ఇరువైపులా కలిపి ఈ సంఖ్యను మాత్రమే అనుమతించనున్నారు.

* వివాహ ఆహ్వాన పత్రికతోపాటు అనుమతి కోరేవారు రూ.10 నాన్‌ జ్యుడీషియల్‌స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు

సమర్పించాల్సి ఉంటుంది.

* ముందుగా దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్‌ కార్డులతోపాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు ఇచ్చినపత్రాలను జత చేయాలి.

* నిబంధనలను ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌–188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam