DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత దేశ సేవలో మహిళల భాగస్వామ్యం వెల కట్టలేనిది

*మహిళలపట్ల అందరూ గౌరవప్రధంగా వ్యవరించాలి*

*ఆదర్శంగా నిలిచిన మాచర్ల రూరల్ ఎస్ఐ. ఉదయలక్ష్మీ.*      

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 18, 2020 (డిఎన్ఎస్):* గుంటూరు జిల్లా మాచర్ల రూరల్ ఎస్ ఐ ఆర్. ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు శుభ్రత ,  పరిశుభ్రత

కార్యక్రమంలో భాగంగా   మాచర్ల రూరల్ పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొని మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్  ను మరియు స్టేషన్ పరిసరాలను శుభ్రపరచారు. ఒక్కసారిగా పరిసరాలన్నీ అద్భుతంగా మారిపోవడంతో సిబ్బంది, సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా

వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో  ముందుకు రావాలి అని  ఇప్పడు ఉన్న పరిస్థితుల్లో సమాజానికి మహిళ శక్తి అవసరం చాలావుంది అని  అమ్మ గా అక్క గా చెల్లి గా బార్య గా  పురుషునికి అన్ని విధాలుగా తోడు ఉంటూ మహిళలు కూడా మగవారికి తగ్గట్లుగా

సమాజానికి దేశానికి  తమవంతుగా సేవలు అందిస్తూన్నారని  ఎలాంటి పరిస్థితులోనైనా మహిళాశక్తి  కూడా మనకి తోడు గా ఉంటుంది  అనే  భావన అందరికి ఉండాలి అని అలాంటి మహిళల కి ప్రతిఒక్కరూ  గౌరవమర్యాదలు ఇచ్చి మీకు మేమున్నము అంటూ వారికి పూర్తి స్వచ్ఛ ని ఇవ్వాలని అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ మహాత్ముడి కోరిక కూడా

నెరవేరుతుందని  ఈ సందర్భంగా  ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్ ఎస్సై ఆర్  ఉదయ లక్ష్మి తో పాటు  వారి సిబ్బంది కూడా పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam