DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి గోశాలకు, దేవాలయ భూములకు రక్షణ కల్పించండి:ఎమ్మెల్సీ మాధవ్

*భూ ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు, ఉద్యోగుల పై కేసులు పెట్టాలి
 
ఇన్నాళ్లు ఆలయాల నుంచి దండుకున్నారు ఇప్పుడు ఇవ్వండి. . .

దేవాలయాలను ఆర్ధికంగా ఆదుకోవాలి, ప్రభుత్వానికి ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 19, 2020 (డిఎన్ఎస్):*

ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయానికి చెందిన సింహగిరి గోశాలను, పనిచేసే సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కోరారు. ఆదివారం సింహాచల దేవస్థానం ఈఓ భ్రమరాంబ ను కలిసి గోశాల అంశం, దేవస్థానానికి చెందిన భూములను ఆక్రమించిన వ్యక్తులపై, వారికి సహకరించిన

దేవస్థాన ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. గతం లో భూ ఆక్రమణల కేసుల్లో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులపై కేవలం నోటిస్ ఇచ్చి వివాదం ముగించేశారన్నారు. అయితే దాతలు భూములు ఇచ్చింది దేవస్థానానికి తప్ప, ఉద్యోగులకు, భూ దందాకోరులకు కాదన్నారు. 

దేవస్థానం భూముల అన్యాక్రాంతం కాకుండా,  గోశాల వంటివరస

సంఘటనలపై  భక్తుల యొక్క భక్తి శ్రద్ధలు దెబ్బతినకుండా చూడాలని, పురోహితులు మరియు ఉద్యోగస్తుల జీతభత్యాల పై వారికి ఎటువంటి ఆ సౌకర్యములు కలగకుండా సమగ్రమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

ఇన్నాళ్లు దండుకున్నారు ఇప్పుడు ఇవ్వండి. . .

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలనుంచి దేవాదాయశాఖ దశాబ్దాల

కాలం నుంచి ప్రతి నెలా కొంత వాటా దండుకుంటోందని, ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క దేవాలయానికి రాష్ట్రం ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు ఇచ్చిందే లేదన్నారు. 

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా, రాష్ట్రం లోని దేవాలయాలకు ఆదాయం లేదని, అర్చకులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు ఆలయాల్లో లేవన్నారు. ఈ దుస్థితి

నుంచి దేవాలయాలు బయట పడాలంటే రాష్ట్ర ఖజానా నుంచి అన్ని దేవాలయాలకు అర్చకులు, సిబ్బంది జీతాల కోసం తక్షణం నిధులు ప్రతి నెల విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు.  

ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రతినిధి పూడిపెద్ది శర్మ, భారతీయ జనతా యువమోర్చా విశాఖ నగర అధ్యక్షులు విజయశంకర ఫణీ, విహెచ్ పి, మహిళా మోర్చా

ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam