DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా వచ్చినా, వాళ్ళ అమ్మమ్మ వచ్చినా టీవీ సీరియళ్లు ఆపేది లేదు. . .

*నటులందరికీ మాస్కులు పెట్టి మరీ తీస్తున్న హిందీ సీరియళ్లు..*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 19, 2020 (డిఎన్ఎస్):* ఈ భూ ప్రపంచం బ్రద్దలైపోయినా తాము షూటింగ్ ఆపేది లేదని బుల్లి తెర సీరియళ్ళ నిర్మాతలు తేల్చేశారు. ప్రస్తుతం కరోనా ధాటికి ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంటే. .

హిందీ సీరియళ్లు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. నటీ నటులందరికీ ముఖాలకు మాస్కు లు పెట్టి మరీ నిర్మించేస్తున్నారు. ప్రతి సీన్ లోనూ నటీ నటులు దాదాపుగా అందరూ మాస్కు లు పెట్టుకునే కనిపిస్తున్నారు. ఇంటి దృశ్యాలు తీసినప్పుడు మాత్రమే మాస్కు లేకుండా నటి నటుల ముఖాలు కనపడుతున్నాయి. ఈ మాస్కులు ఉండడం వలన అసలు నటీ నటులు ఎవరో

కూడా తెలియకుండా పోతోంది. ఇంటి బయట నుంచి అడుగు బయట పెట్టె సీన్ లు, బయట నుంచి ఇంటికి వచ్చే వారు తప్పని సరిగా ముఖానికి మాస్కులు పెట్టుకుని కనపడుతున్నారు. 

మరో సీరియల్ అయితే ఏకంగా నటీ నటులను క్వారంటైన్ లో పెట్టినట్టుగా ఒక్కొక్కరినీ ఒక్కో గదిలో పెట్టి అక్కడే కదంశం నడిపించేస్తున్నారు. 

కరోనా కాదు,

దాని అమ్మమ్మ వచ్చినా మేము సీరియళ్లు తియ్యడం ఆపేది లేదని, సందర్భానికి అనుగుణంగా సీరియల్ నడిపించేస్తామని నిర్మాతలు ప్రకటిస్తున్నారు. 
ప్రస్తుతం ఈ హంగామా కేవలం హిందీ సీరియల్ వరకే పరిమితం అయ్యింది. వీటిని చూస్తే తెలుగు నిర్మాతలు కూడా తెలుగు సీరియల్లో నటి నటులకు మాస్కులు పెట్టి మరీ ప్రజలకు చుక్కలు చూపించడం

ఖాయంగా కనపడుతోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam