DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వ శ్రేష్ఠ శ్రవణం. . .శ్రావణమాసం,  21 నుంచి ప్రారంభం

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 20, 2020 (డిఎన్ఎస్):* ఏడాది లో సర్వ శ్రేష్ఠ ప్రాధాన్యం కల్గిన మాసం శ్రావణమాసం. ఈ నెల 21 నుంచి ప్రారంభం అవుతున్న సందర్బంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ విశేష ఆరాధనలు ( కొన్ని చోట్ల ఏకాంతంలోనే) నిర్వహిస్తున్న తరుణంలో ప్రత్యేక శీర్షిక.

.

సృష్టి , స్థితి లయ కారకులైన త్రిమూర్తుల లో స్థితి కారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు కు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మి కి, అత్యంత ప్రీతికర మైన మాసం.

వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్య మైన మాసం శ్రావణ మాసం.

చాంద్ర

మానం ప్రకారం శ్రావణ మాసం ఐదవ మాసం. ఈ మాసం లోని పూర్ణిమ నాడు చంద్రుడు, శ్రవణ నక్షత్రం సమీపం లో ఉంటాడు, కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. 

శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం, అటువంటి శ్రవణా నక్షత్రం పేరు తో, ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజ కు ఉత్కృష్ట మైన

మాసం.

శ్రావణ మాసం లోని మూడు వారాలు అత్యంత పుణ్య ప్రదమైనవి. మంగళ , శుక్ర , శనివారాలు. ఈ వారాలు మూడు, ఈ మాసం లో అత్యంత ప్రధానమైనవి , మహత్తు ను కలిగినవి. 

శ్రావణ మాసం లోని మంగళ వారాలు శ్రీ గౌరీ పూజ కు, శుక్రవారాలు శ్రీ లక్ష్మీ పూజ కు, శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజ కు ముఖ్యమైన దినాలు. 

వీటికి

తోడు శ్రావణ మాసం లోని శుక్ల పక్షం లో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కో రోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.

పాడ్యమి    – బ్రహ్మదేవుడు
విదియ       – శ్రీయఃపతి
తదియ       – పార్వతీదేవి
చవితి         – వినాయకుడు
పంచమి      – శశి
షష్టి             – నాగ

దేవతలు
సప్తమి         – సూర్యుడు
అష్టమి         – దుర్గాదేవి
నవమి        – మాతృ దేవతలు
దశమి           – ధర్మరాజు
ఏకాదశి         – మహర్షులు
ద్వాదశి        – శ్రీ మహావిష్ణువు
త్రయోదశి     – అనంగుడు
చతుర్దశి        – పరమ శివుడు
పూర్ణిమ        –

పితృదేవతలు

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు, శ్రావణ మాసం మహిళల కు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసం లోనే ఉండడం వల్ల వ్రతాల మాసమని , సౌభాగ్యాన్ని ప్రసాదించే మాస మని కూడా పేర్కొనబడింది.

మంగళ గౌరీ వ్రతం : శ్రావణ మాసం లో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని

కొత్త గా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెల లోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను. 

వరలక్ష్మీ వ్రతం: మహిళలకు అత్యంత ముఖ్య మైన శ్రావణ మాసం లో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం.  దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింప వలెను. 

శ్రావణ మాసం లో వచ్చే పండగలు

శుక్లచవితి -

నాగులచవితి, మన రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాల లో ఈ రోజు నాగుల చవితి పండుగ ను జరుపు కుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి - పుత్రదా ఏకాదశి: ఈ ఏకాదశి కే లలితా ఏకాదశి అని కూడా పేరు.  పుత్ర సంతానం కావాలనుకునే వారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ

పూర్ణిమ - రాఖీ పూర్ణిమ - జంధ్యాల పూర్ణిమ: సోదరుడి సుఖ సంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు. నుదుట బొట్టు పెట్టి  అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుక లివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ –

హయగ్రీవ జయంతి: వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం. హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణ విదియ - శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి: క్రీ.శ.1671 వ సంవత్సరం లో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియ నాడు

శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవం గా సమాధి లో ప్రవేశించారు.

కృష్ణ పక్ష అష్టమి – శ్రీ కృష్ణాష్టమి: శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీ కృష్ణ పరమాత్మ జన్మించిన రోజు. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యం గా పాలు ,

పెరుగు , మీగడ , వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణ పక్ష ఏకాదశి – కామిక ఏకాదశి: ఈ దినం ఏకాదశీ వ్రతం , ఉపవాసాలను పాటించడం తో పాటు నవనీతమును దానం చేయడం మంచిది. ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసు లో ఉన్న కోరికలన్నీ నెరవేరు తాయని శాస్త్ర వచనం.

అమావాస్య – పోలాల అమావాస్య: ఇది వృషభాలను పూజించే పండుగ.

 కాగా కాల క్రమం లో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినం గా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam