DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలిక పై అత్యాచార ఘటనలో ముద్దాయిలు 12 మంది అరెస్ట్

*రాజమండ్రి మైనర్ కేసులో పెద్ద ముఠా కోర్టుకు అప్పగింత* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 20, 2020 (డిఎన్ఎస్):* ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు ప్రాంతం మధురపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్

చేసినట్టు రాజమండ్రి ఎస్పీ షేముషి బాజ్పాయి తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో ఆమె వివరాలను తెలిపారు. 
బాధితురాలు (16 సంవత్సరాలు) మైనర్ అని, 10 వ తరగతి చెడుతోందని, తండ్రి మారణించాడని, తల్లి రోజు కూలి పని చేస్తుందన్నారు. అయితే కుటుంబ పోషణకు తన వంతు సహకారం కోసం తన సమీప బంధువు అనిత ద్వారా ఒక వస్త్ర

దుకాణం లో చేరిందన్నారు. ఈమె స్థితి తెలిసిన అనిత ఈమెను ఒక పావుగా వాడుకునే దుర్భుద్ధి తో మరో ఐదుగురు యువకులతో కలిసి కుట్ర పన్ని, జూన్ 22 న బాధితురాలు ఇంటికి వెళ్లి, విమానాశ్రయ రోడ్ కు తీసుకు వెళ్లారు. ముందుగా వేసుకున్న పధకం ప్రకారం ముద్దాయిలు ఆటోలో వచ్చి, బలవంతంగా బాలికను రంపచోడవరం తీసుకు వెళ్లారన్నారు. ఆ ప్రాంతంలో

బాలికపై ఒకరి తరువాత ఒకరు మానభంగం జరిపారని తెలిపారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని కూడా బెదిరించారన్నారు. భయపడిన బాలిక విషయం ఎవరికీ చెప్పలేదన్నారు. ఆ తర్వాత కూడా ఈ ముఠా తో పరిచయం ఉన్నవారు సైతం ఈమెపై పలు మార్లు మానభంగం చేశారన్నారు. బాధితురాలు అనారోగ్యంగా ఉండడంతో ఆమెను తల్లి బయటకు పంపలేదన్నారు. అలవాటు పడిన అనిత

బృందం ఈ నెల 12 న మరో సారి ఇదే పని చెయ్యడం తో పాటు ఆమెను రాజమండ్రి లోని రాయల్ హాస్పిటల్ దగ్గర ఉన్న కసిరెడ్డి లావణ్య అనే ఆమె ఇంట్లో బందించారని వివరించారు. 
మూడు రోజులుగా కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లి ఈ నెల 15 న  పోలీస్ ఫిర్యాదు చేసిందన్నారు. పోలీస్ కేసు తెలుసుకున్న ముఠా ఈమెను వదిలిపెట్టారన్నారు. ఈ ఘటన ను మొత్తం

ఛేదించి, ముఠాను బంధించి మొత్తం 12 మందిని అరెస్టు చేసి కోర్టుకు పంపినట్టు తెలిపారు. ఈమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మిస్సింగ్ కేసు, రేప్ కేసు, పోక్సో , ఎస్ సి , ఎస్ టి అత్యాచార చట్టాలక్రింద మర్చి కేసును నార్త్ జోన్ డిఎస్పీ పి ఎస్ ఏన్ రావు దర్యాప్తు చేసిన్నట్టు వివరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam