DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లి రూపంలో చెల్లుబోయిన కు డబుల్ బంపర్ అఫర్

*నాడు ఎమ్మెల్యే టికెట్ . . . నేడు ఖాళీ చేస్తే మంత్రి పదవి*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 21, 2020 (డిఎన్ఎస్):* బుధవారం రాష్ట్ర మంత్రి గా పదవి స్వీకారం చేస్తున్న చెల్లుబోయిన వెంకట రమణ కు ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ రూపం లో డబల్  బంపర్ అఫర్

లభించింది. 

తూర్పు గోదావరి జిల్లా లో రామచంద్రపురం శాసన సభ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిరునామాగా మారిన పిల్లి సుభాష్ చంద్రబోస్ 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా మండపేటకు మారడంతో ఆ స్థానం లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అదే జిల్లాలో వేరే గ్రామం (రాజోలు)  కు చెందిన చెల్లుబోయిన వెంకట రమణ

ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యే గా టికెట్ ఇచ్చారు. కాలం కలిసి వచ్చి చెల్లుబోయిన ఎమ్మెల్యేగా బంపర్ మెజారిటీ తో గెలిచారు. 

ఇదిలా ఉండగా మండపేట నియోజకవర్గం లో ఓడిపోయినా పిల్లి కి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించారు వైఎస్ జగన్. అనంతరం పిల్లి సుభాష్ చంద్ర బోస్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు.

ప్రస్తుతం అదే పిల్లి రాజ్య సభ కు ఎన్నిక కావడంతో మంత్రి పదవికి రాజీనామా చెయ్యవలసి వచ్చింది.  

ఆ ఖాళీ లో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇతనొక్కరే ఉండడంతో, అదే నియోజక వర్గానికి చెందిన చెల్లుబోయిన కు మంత్రి పదవి ని కేటాయించారు. 

నాడు ఎమ్మెల్యే గా సీటు వచ్చింది కూడా పిల్లి సుభాష్ చంద్ర

బోస్ స్థానం మారడం వల్ల  అయితే, నేడు మంత్రి పదవి వరించిన అయన రాజీనామా చెయ్యడం వల్లే. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam