DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాధిత మైనర్ బాలికకు ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల సాయం

*స్త్రీ సంక్షేమ శాఖా నుంచి రూ. 25 వేలు మంత్రి అందజేత* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 22, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా మధురపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలికకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చెక్కును బుధవారం నాడు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అభిషి క్త్ కిషోర్,

రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భారత్ రామ్ లు అందించారు. బుధవారం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యం పొందుతున్న ఆమెను, ఆమె కుటుంబాన్ని కలిసి తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల  ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే.

 

మంత్రి తానేటి వనిత పరామర్శ : . . .

బుధవారం నాడు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యం పొందుతున్న ఆమెను, ఆమె కుటుంబాన్ని కలిసి తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆమె  కుటుంబానికి నష్టపరిహారం  స్త్రీ శిశు

సంక్షేమ శాఖ నుండి 25 వేల రూపాయలు తక్షణ సహాయం క్రింద చెక్కును అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ సమాజంలోఇటువంటి  సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.  సగటు మనిషికి ఆవేదన కలిగించే సంఘటన అన్నారు. మహిళలకు పూర్తి భద్రత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం

ప్రవేశపెట్టారన్నారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన  కు చెలించిన సీఎం వెంటనే మన రాష్ట్రంలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అన్నారు. దళితుల పట్ల మహిళల పట్ల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కేసులో విచారణ 13 మందిపై జరుగుతుందని వీరిపై ఎస్సీ ఎస్టీ చట్టం,  దిశ, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి అన్నారు. 10వ తరగతి వరకు చదివిన

 మైనర్ బాలికకు స్త్రీ శిశు  సంక్షేమ శాఖ ద్వారా హోమ్ లో ఉంచి విద్యను కొనసాగిస్తామన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ బాలికకు ప్రభుత్వం నుండి విద్య, వైద్య సదుపాయాలు అందిస్తామన్నారు. 

ఈమె వెంట రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, వేమూరు శాసన సభ్యులు మెరుగు నాగార్జున, ఐ సి పి ఎస్ పి డి పుష్ప మణి,

ఐ సి పి ఎస్ డి సి పి ఓ సిహెచ్ వెంకట్రావు, కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam