DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆసుపత్రి సేవలను వినియోగించుకోండి : శ్రీకాకుళం ఎస్పీ అమిత్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 22, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నందు పోలీసు అర్ముడు రిజర్వు కార్యాలయంలో  "పోలీస్ సంక్షేమ వైద్యశాల"  సేవలను జిల్లాలో గల పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సబ్యలు వినియోగంచుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలియచేసారు.

బుధవారం ఈ కార్యాలయంలో గల  "పోలీస్ సంక్షేమ వైద్యశాల"ను సందర్శించారు. ఈయనతో పాటు అదనపు ఎస్పీ పి. సోమశేఖర్ (పరిపాలనా) , డా. ఎమ్.జె ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. 
కోవిడ్-19 కరోనా వైరస్ కట్టడి చెయూ దిశలో భాగంగా వైద్యశాలలో ఉన్న సిబ్బంది, అందుబాటులో గల సేవలు మరియు సిబ్బందికి ఇచ్చే ఔషధాల (మందులు) వివరాలను డాక్టర్ గారిని

అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్యశాలలో ఔషధాల(మందులు) నిల్వలు  తెలిపే విధంగా ప్రత్యేక సాఫ్ట్ వెర్ ను అందుబాటులోకి తెచ్చుకొని ప్రతి రోజు నిల్వలు ఎప్పటికి అప్పుడు తెలియజేయాలని సూచించారు.
వైద్యశాలకు చికిత్స నిమిత్తం వొచ్చే రోగులు కొరకు వొచ్చే మార్గం వెళ్ళే మార్గం వేర్వేరుగా ఉండాలన్నారు. అలాగే పేషెంట్లు

వేచి ఉండడానికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని  సూచించారు. అదేవిధంగా పాడుబడిన  క్వార్టర్స్ వివరాలును తెలిసికొని, గ్యాస్ గోడం యొక్క మరమ్మతులును చేపట్టాలని ఆదేశించారు. 

అనంతరం ఎచ్చర్ల మండలం లో ఏర్పాటు చేయనున్న ఏ.పి.ఎస్.పి బెటాలియన్ స్థలమును సందర్శించి పరిశీలించారు. ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ  పి.

సోమశేఖర్ (పరిపాలనా), డాక్టర్.ఎమ్.జె ప్రసన్న కుమార్, ఆర్ఐలు బి. ప్రదీప్, ఉమా మహేష్,  ఎచ్చెర్ల ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam