DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ సమస్యలకు శ్రీకాకుళం లో కంట్రోల్ రూమ్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 22, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ 19  జిల్లా కంట్రోల్ రూమ్ (స్పందన హాల్) నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ కోవిడ్ సమస్యలు, పిర్యాధులు పరిష్కారానికి

జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు. 08942 240605 ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని ఆయన చెప్పారు. కంట్రోల్ రూమ్ కు అందిన ఫిర్యాదులు,  సమస్యలపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 
కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు తమ సమస్యలను పరిష్కరించుటకు ప్రత్యేకంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని

ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ఈ కేంద్రం జిల్లా మహిళా సమాఖ్య ప్రాంగణంలో ఉందని, సమస్యలు ఉన్నవారు 08942 240615 ఫోన్ నంబరుకు తెలియజేయవచ్చని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam