DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాస్కులేదు, కనీసదూరం లేదు, కరోనా అంటే గాజువాక లో పట్టింపే లేదు

*ప్రజలకు భాద్యత లేదు, అధికారులకు పట్టింపు లేదు.* 

**పారిశుద్యం కానరాని టిఫిన్ సెంటర్లలో విచ్చల విడిగా జన సంచారం*   

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 23, 2020 (డిఎన్ఎస్):* కరోనా రాక్షసుడు ప్రపంచాన్ని వణికిస్తుంటే. . విశాఖ నగర పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు

భాద్యత లేకుండా పోయింది, పాలకులకు పట్టింపు లేకుండా పోయింది. బుధవారం ఒక్క రోజే విశాఖ లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయినా సరే ఏమాత్రం ఖాతరు లేకుండా ప్రజలు ముఖానికి మాస్కులు లేకుండా, అస్సలు పారిశుద్యమే లేని రోడ్ ప్రక్కన టిఫిన్ సెంటర్లలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 

గాజువాక నియోజకవర్గ పరిధిలోని

 పెదగంట్యాడ లో రోడ్డు పైకి వచ్చిన ప్రజలకు మాస్కులేదు, కనీసదూరం లేదు, కరోనా అంటే గాజువాక లో పట్టింపే లేదు. ఈ ప్రాంత అభివృద్ధిలో రాత్రి పగలు నిద్రలేకుండా అవిశ్రాంతంగా కృషి  ఎమ్మెల్యే కు వీళ్ళు కనిపించకుండా గాజువాక మార్కెట్ లోకి విచ్చలవిడిగా తిరుగుతున్నారు.  

గాజువాక మార్కెట్ లో ప్రత్యేకతలు: గాజువాక

మార్కెట్ లో చిరు వ్యాపారులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర వస్తువులు, టిఫిన్లు అమ్మేవాడికి మాస్కు ఉండదు, కొనుక్కునే వాడికి మాస్కు ఉండదు. ఇద్దరికీ కనీస దూరం కూడా ఉండదు.  

వీళ్ళని అదుపుచేసే ప్రభుత్వ అధికారులే కనపడడం లేదు. పైగా ప్రశ్నించే వాళ్ళని గేలి చెయ్యడం కూడా ప్రత్యేకత. 

నూడిల్సు , పకోడీ,

ఇడ్లిలు, తయారు చేసే వాళ్లకి, వాటిని అమ్మే వారికి ఎవ్వరికీ కనీసం ముక్కు రుమాలు కూడా లేదు. అవి కొనుక్కోడానికి వచ్చే వాడికి కూడా ముఖానికి మాస్కులు లేవు. పైగా అంతా ఒకే సారి ఎగబడి మరీ కుంటున్నారు. 

పైగా ఈ ప్రాంతం గ్రేటర్ విశాఖపట్నం మహా నగరం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పరిధిలోనే ఉంటుంది. మార్కెట్ లో

బహిరంగంగా జరుగుతున్నా ఈ క్రయ విక్రయాల పట్ల గాజువాక జోనల్ కమిషనర్ గానీ, పారిశుధ్య విభాగం అధికారులు, ఈ దుకాణాలపై ఎందుకు దృష్టి పెట్టలేదు వారికే తెలియాలి. 
పైగా గతంలో గాజువాక లోని ఒక మాంసం వ్యాపారి కి సైతం ఈ విధంగానే పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

మాస్కు లేకుంటే రూ. 100 ఫైన్ ఎవరికీ ? . .

మాస్కు

ధరించకుండా రోడ్డు పైకి వస్తే రూ. 100 ఫైన్ వెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తే గాజువాక మార్కెట్ లో సగానికి పైగా జనానికి, వ్యాపారులకు ఫైన్లు వెయ్యవలసిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు ఆ విషయాన్నీ మరిచిపోయినట్టు ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam