DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి సాక్షిగా యంత్రాంగం అంతా పాత్రికేయుని చంపేశారు

*పాత్రికేయునికి ప్రభుత్వం ఇచ్చిన విలువ కు నిదర్శన. . .*

*అత్యంత దౌర్భాగ్య స్థితిలో రాజమండ్రి ఆసుపత్రి*

*ఆక్సిజన్ లేదు, వైద్యులే లేరు,  సిబ్బంది లేరు*

*చికిత్స చేయాల్సిన వాళ్ళే చేజేతులా చంపేశారు.* 

*రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కె. పార్దసారధి మండిపాటు*  

*DNS

రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 23, 2020 (డిఎన్ఎస్):* రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగ మోగుతోంది. ఓ పాత్రికేయుడు మృత్యుముఖంలోకి వెళ్ళి పోయాడు. ప్రభుత్వం లో ఉన్నత స్దాయి అధికారులు చెప్పినా సరే రాజమండ్రి నగరంలో  ఆదేశాలు పాటించి అమలు చేసే యంత్రాంగం లేకుండా

పోయింది.

ప్రైవేటు రంగంలో అయితే అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు.. అసలు పట్టించుకోవడం లేదు.. డబ్బే ప్రదానంగా ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య సేవలు కొనసాగుతున్నాయి.. 

కరోనా తో ప్రజలంతా భయపడి చస్తుంటే ...కొందరు ఈ కరోనా మహమ్మారి పేరుతో వ్యాపారం చేసుకుంటున్నారు.. కనీసం కరోనా ఉందో లేదో టెస్టు

చేయమని రాజమండ్రి సీనియర్ పాత్రికేయులు.. ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు పదే పదే ఈ నెల 20 వ తేదీ రాత్రి చెప్పారు.. 

ప్రభుత్వ వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, ఆక్సిజన్ కొరత మొత్తం వెరసి ఒక పాత్రికేయుణ్ణి బలి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే. . .కరోనా పరీక్షలు చేయించమని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సుంకర

రామారావు (టీవీ 5 రూరల్ విలేకరి ) ను ఈ నెల 18 వ తేదీన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.. 19   వ తేదీ కరోనా పరీక్ష చేయలేదు.. ఆదివారం కాబట్టి పాత్రికేయులు కూడా సంయమనం పాటించారు... 20 వ తేదీ రాత్రికి రామారావుకు శ్వాస అందడం లేదు.. ఆక్సిజన్ కావాలని అధికారులకు పాత్రికేయ మిత్రులు ఫోన్ చేశారు... ఆశించిన స్దాయిలో సంతృప్తి

కరమైన సమాదానం రాలేదు.. తరువాత  వేద్యసేవలు అందించడంలో కూడా ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే గురువారం సాయంత్రం వీడియో జర్నలిస్టు రాము చనిపోయారు. 
దీంతో గురువారం సాయంత్రం రాజమండ్రి పాత్రికేయులు ఆసుపత్రికి చేరుకొని వైద్యుల నిర్లక్ష్యానికి కాగడాలతో నిరసన తెలియచేసారు.

 

పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా?. : ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో సైతం పోరాటం చేస్తూ ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన విలువ ఇదేనా అని రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుపూడి పార్దసారధి మండిపడ్డారు. రాజమండ్రి ప్రభుత్వ

ఆసుపత్రిలో గురువారం రాజమండ్రి టి.వి 5. వీడియో జర్నలిస్టు సుంకర రాము మరణం పై ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వైద్యులను తాము గత మూడు రోజులుగా వేడుకున్న కనీసం స్పందన లేని కారణం గా ఒక సహచరుణ్ణి కోల్పోవలసి వచ్చిందన్నారు. 

గత  మూడు రోజులుగా   ఆక్సిజన్  అందించాలని పాత్రికేయ పెద్దలు చేయని ప్రయత్నం లో కనీసం ఒక్క

వైద్యుడు స్పందించలేదన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. రాము కుటుంబ సభ్యులకు పాత్రికేయ సంఘాలు అండగా నిలబడతాయని తెలిపారు. 

పాత్రికేయుల కాగడా ప్రదర్శన . .: 

సహచర పాత్రికేయుని మృతికి నిరసనగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యవం లో పాత్రికేయులు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాగడాలతో నిరసన

ప్రదర్శన చేసారు. ఈ సందర్భాంగా రాజమండ్రి గోదావరి తీరం సాక్షిగా యంత్రాంగం అంతా పాత్రికేయుని చంపేశారు అని పాత్రికేయ సంఘాలు నిరసనలు చేసారు.  

పాత్రికేయుని మృతి బాధాకరం : 

ఏపీ జె యూ  రాష్ట్ర అదనపు కార్యదర్శి రాజా.

గత మూడు రోజుల వరకూ అందరితో కలిసి పనిచేసిన పాత్రికేయుని మరణం అత్యంత

బాధాకరమని ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పెంటపాటి రాజా తెలిపారు. గురువారం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాత్రి పాత్రికేయులు జరిపిన కాగడాల నిరసనలతో ప్రభుత్వం కళ్ళు ఇప్పడికైనా తెరుచుకోవాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam